1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. It is alleged that youths in Vijayawada rammed their Thar jeeps into one another over drugs and a girl

డ్రగ్స్, యువతి కోసమే విజయవాడలో యువకుల థార్ జీపులతో ఢీకొట్టుకున్నారట

Young persons
ప్రభుత్వం ఎంత కట్టడి చేస్తున్నా డ్రగ్స్ దందా నడుస్తూనే వుంది. ఇటీవలే విజయవాడలో థార్ జీపులతో ఇద్దరు యువకులు ఢీకొట్టుకుంటూ పరస్పరం దాడి చేస్కున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తులో పలు విషయాలు వెలికి వచ్చాయి. విజయవాడ 100 ఫీట్ రోడ్డులో థార్ జీపులతో హంగామా సృష్టించిన కేసులో నిందింతుల్లో ఒకరైన బొల్లా ఓంకార్ డ్రగ్స్ సేవించినట్లు వైద్య పరీక్షలో తేలింది.
 
ఇతడు మరో యువకుడితో థార్ జీపుతో చేసిన దాడి వెనుక కారణం యువతి కోసమేనని తేలింది. వీరు గొడవ పడిన సమయంలో ఒక జీపులో సదరు యువతి కూడా వున్నట్లు సీసీ ఫుటేజిలో రికార్డయ్యింది. కాగా ఆ యువతి ఎవరన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
జీవవైవిధ్య దినోత్సవం: ఐటీసీ మడ అడవుల సంరక్షణ ద్వారా తీరప్రాంత పర్యావరణ వ్యవస్థ బలోపేతం