శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 10 నవంబరు 2016 (11:52 IST)

పెద్ద నోట్ల రద్దు.. ఈ యుద్ధం ఇక్కడితోనే ఆగిపోకూడదు.. జేపీ కామెంట్

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిర్ణయాన్ని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ స్వాగతించారు. పెద్ద నోట్ల రద్దును అవినీతి యుద్ధంపై తొలి అడుగుగా భావిస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుత పరి

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిర్ణయాన్ని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ స్వాగతించారు. పెద్ద నోట్ల రద్దును అవినీతి యుద్ధంపై తొలి అడుగుగా భావిస్తున్నట్లు తెలిపారు. కానీ అవినీతిపై జరిగే ఈ యుద్ధం ఇక్కడితోనే ఆగిపోతే ఎటువంటి ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. ఇక నుంచి లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉంటాయన్న ఆయన పెద్ద నోట్లు దాచుకునేందుకు ఇక నుంచి అవినీతిపరులు భయపడతారన్నారు. 
 
కాగా పాతనోట్ల‌ను మార్చుకోవ‌డానికి, త‌మ వ‌ద్ద ఉన్న డ‌బ్బుని డిపాజిట్ చేసుకోవ‌డానికి బ్యాంకుల ముందు వినియోగ‌దారులు ఆసక్తి చూపుతున్నారు. రెండు వేలు, ఐదు వంద‌ల కొత్త నోట్ల‌ను తీసుకొని మురిసిపోతున్నారు. వాటి డిజైను, రంగు గురించి మాట్లాడుకుంటూ క‌నిపిస్తున్నారు. నిన్న వంద నోట్ల కోసం ఎన్నో పాట్లు ప‌డిన ప్ర‌జ‌లు ఈ రోజు బ్యాంకుల్లో వంద నోట్ల క‌న్నా రెండు వేల నోట్ల‌నే తీసుకోవ‌డానికి ఎంతో ఆస‌క్తి చూప‌డం గ‌మ‌నార్హం. ఇబ్బందులు పడుతున్నా కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తామని.. బ్లాక్ మనీకి చెక్ పెట్టేందుకు మద్దతిస్తామని వినియోగదారులు మీడియాతో చెప్తున్నారు.