Kavitha: కవితకు అలా చెక్ పెట్టిన నారా లోకేష్.. ఏంటి సంగతి?
తెలంగాణ విద్యార్థులు చదువుల కోసమో లేదా ఉద్యోగాల కోసమో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లడం లేదని, కానీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మాత్రం సంతోషంగా హైదరాబాద్‌కు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారని కల్వకుంట్ల కవిత అన్నారు. ఇకపై హైదరాబాద్‌లో ఉద్యోగాలు పొందేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను అనుమతించకూడదనే భావనను ఆమె వ్యక్తం చేశారు. ప్రాంతీయ విభేదాలను రేకెత్తించేలా ఉన్న కవిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తరుణంలో, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ అందరినీ కలుపుకుపోయే స్వభావం కలిగిన రాష్ట్రమని, ఇక్కడ ప్రాంతీయ ప్రాధాన్యతలకు సంబంధించిన వివాదాలకు తావులేదని ఏపీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
తాము నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ సరిగ్గా ఇలాంటిదే. ఇక్కడ భౌగోళిక ప్రాంతం కంటే ప్రతిభకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఎక్కడి నుండి వచ్చారని తాము అడగమన్నారు. ప్రతిభకే పెద్దపీట వేస్తామని తెలిపారు. కానీ రాష్ట్ర సరిహద్దులు అవకాశాలను పరిమితం చేయనివ్వకండన్నారు.
