సోమవారం, 16 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 19 జనవరి 2026 (11:53 IST)

మధుపానం మహాదానందం మనోధైర్యం ధనాధన్, పోటీపడి 19 బీర్లు తాగి మృతి

Police
ఇటీవలే సంక్రాంతి బ్లాక్ బస్టర్ చిత్రం మనశంకర ప్రసాద్ గారు చిత్రంలో హీరో మద్యం సేవిస్తూ.. మధుపానం మహాదానందం మనోధైర్యం ధనాధన్ గుటగుట తాగేస్తాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో పలువురు ఇవే వాక్యాలు చెబుతూ మందు కొడుతూ గ్లాసులు కూడా చూపిస్తున్నారు. అదేదో వినోదం కోసం చేసినదైతే కొందరు అది నిజంగానే పాటించేస్తున్నారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... అన్నమయ్య జిల్లా బండవడ్డిపల్లిలో సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఆరుగురు స్నేహితులు ఒకచోట చేరారు. మద్యం తాగడం పోటీగా పెట్టుకున్నారు. అతి తక్కువ సమయంలో ఎవరు అత్యంత ఎక్కువ బీర్లు తాగుతారు అన్న అంశంపై పోటీపడి బీర్లు మీద బీర్లు తాగేశారు. అలా మొత్తం 19 బీర్లు తాగేసి తీవ్ర అశ్వస్థతకు లోనయ్యారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేలోపే మరణించారు.
 
కాగా ఇది కల్తీమద్యం అంటూ కొందరు చేసిన ఆరోపణలను పోలీసులు కొట్టిపారేశారు. ఇది కేవలం ఆరుగురు స్నేహితుల మధ్య మద్యం సేవించడంలో పడిన పోటీ కారణంగా జరిగిందని తేల్చారు.