గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chitra
Last Updated : మంగళవారం, 3 మే 2016 (12:58 IST)

ప్రేమ వ్యవహారం.. ఇష్టం లేని పెళ్ళి.. ఫ్యానుకు ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య ఎక్కడ?

ఇష్టం లేని పెళ్లి జరిపిస్తుండడంతో హుస్సేన్(25) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు పట్టణం కేంద్ర పరిధిలో గల నల్లబండబజారులో ఈ సంఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పొరుగూరి అమ్మాయితో హుస్సేన్‌కు ఇటీవలే పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఈ నేపథ్యంలో వధువు కుటుంబసభ్యులతో పెళ్లి విషయమై మాట్లాడేందుకు వరుడు కుటుంబసభ్యులు వెళ్లారు. 
 
ఇదే అదనుగా భావించిన హుస్సేన్ మంగళవారం ఉదయం ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన పక్కింటివారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 
అయితే హుస్సేన్ బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. ప్రేమవ్యవహారమే అతడి మరణానికి కారణం కావచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.