సంబంధిత వార్తలు
- ఆస్తి కోసం అన్న చేతిలో హత్యకు గురైన న్యాయవాది స్వప్న... గుండె ఆగి చనిపోయిన తల్లి
- ఫిబ్రవరి 26 తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
- కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్న... కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత - హరీశ్ రావుపై పోటీ...
- త్వరలో తెలంగాణ మహిళలకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు
- Sudarshan Reddy: తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ.. సుదర్శన్ రెడ్డికి ఆ ఛాన్స్?
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణల్లో వర్షాలు కురుస్తాయా?
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్పపీడనాలు ఈ వేసవి కాలంలో వర్షాలకు కారణం అవుతున్నాయి. ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం ప్రధానంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాలపై ఉంటుందని... మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు.
ఈ ప్రభావం రెండు మూడు రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అల్పపీడనం ప్రభావంతో చెదురుమదురు జల్లులు కురిసే అవకాశాలున్నాయని వాతవరణ విభాగం ప్రకటించింది.
తెలంగాణలో కూడా వచ్చే ఆదివారం (ఫిబ్రవరి 22) నుండి అల్పపీడనం ప్రభావం కనిపిస్తుందని... వర్షాలు మొదలవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
