1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Modi to inaugurate Bhogapuram airport by July-end, says Rammohan Naidu

ప్రారంభోత్సవానికి భోగాపురం విమానాశ్రయం : మంత్రి రామ్మోనాయుడు

rama mohan naidu
ఏపీలోని భోగాపురంలో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖామంత్రి కె.రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధి చరిత్రకు నాంది పలుకుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులపై ఆయన మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలతో జీఎంఆర్ సంస్థ షెడ్యూల్ ప్రకారం నిర్మాణ పనులను పూర్తి చేసిందని చెప్పారు. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమయం ఖరారు చేస్తే వారి చేతుల మీదుగా ఈ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుక ఉంటుందని తెలిపారు. 78 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ టెర్మినల్ భవనం సంవత్సరానికి ఏకంగా నాలుగు కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించే సామర్థ్యం కలిగి ఉంటుందని చెప్పారు. 
 
ఉత్తరాంధ్ర సంస్కృతి, కళలు ఉట్టిపడేలా డిజైన్ చేయడంతో ఇది దేశంలోనే అత్యుత్తమ విమానాశ్రయాల్లో ఒకటిగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ప్రారంభమైన వారం రోజుల లోపు విమానాశ్రయ కార్యకలాపాలను భోగాపురం నుంచి ప్రారంభించి, వచ్చే యేడాది మార్చి నాటికి పూర్తి స్తాయి సేవలు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
పదవీవిరమణకు సురక్షితమైన పొదుపు కోసం జనరాలి సెంట్రల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ సునేహ్రా పింఛన్ పథకం