1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. mudragada padmanabham family rejects state honors for funeral in sensational decision

ముద్రగడ పద్మనాభం మృతి... ప్రభుత్వ అధికారిక లాంఛనాలు వద్దన్న కుటుంబీకులు

mudragada
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన అంత్యక్రియలను టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, ముద్రగడ పద్మనాభం కుటుంబీకులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని తిరస్కరించారు. జీవించివున్నపుడు అనేక విధాలుగా అవమానించి, ఇపుడు అధికారిక గౌరవాలు, సానుభూతి తమకు అవసరం లేదని ఆయన కుటుంబీకులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 
 
ఇదే అంశంపై కాకినాడ జిల్లా కిర్లంపూడిలో వైకాపా నేత జక్కంపూడి రాజా మాట్లాడుతూ, ముద్రగడ జీవించివున్నపుడు ఆయన్ను ఎన్నో రకాలుగు ఇబ్బందులకు గురిచేశారు. అవమానించారు. చనిపోయిన తర్వాత ఇపుడు ప్రభుత్వ లాంఛనాలు వద్దని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారని వెల్లడించారు. ముద్రగడ అధికారం కోసం కాకుండా, ప్రజా సమస్యల కోసం పోరాడిన గొప్ప నాయకుడని ఆయన కొనియాడారు. దీంతో ప్రభుత్వ లాంఛనాలు లేకుండానే కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోనే ఈ అంత్యక్రియలు జరుగనున్నాయి. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఎలక్ట్రిక్ స్కూటర్‌కు చార్జ్ చేస్తుండగా మంటలు... ఇద్దరు మృతి