ముద్రగడ అంత్యక్రియలు: గౌరవ వందనం చేస్తున్న పోలీసులను తోసేసిన అంబటి, వీడియో
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో తీవ్ర గందరగోళం నెలకొన్నది. ప్రభుత్వ లాంఛనాలతో ముద్రగడ అంత్యక్రియలు జరిపించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనితో పోలీసులు ముద్రగడ అంత్యక్రియలలో ఖననం జరుగుతున్నప్పుడు గౌరవ వందనం చేసేందుకు సిద్ధమయ్యారు.
పోలీసులు గౌరవ వందన సమర్పణ చేస్తున్న సమయంలో వైసిపి నాయకుడు, మాజీమంత్రి అంబటి రాంబాబు వారిపైకి దూసుకెళ్లారు. కుటుంబ సభ్యులు వద్దని చెబుతుంటే మీరు ఎందుకు గౌరవ వందనం చేస్తున్నారంటూ పోలీసులను పక్కకి నెట్టివేసారు. దీనితో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొన్నది.
ప్రభుత్వం ఆదేశం మేరకు తాము విధులు నిర్వహిస్తున్నామని చెప్పినా అంబటి వినిపించుకోలేదు. తక్షణమే పోలీసులు గౌరవ వందన సమర్పణను ఆపివేయాలనీ, ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ వారితో వాదించారు.
కాకినాడ
— RTV (@RTVnewsnetwork) July 15, 2026
చివరి దశకు చేరిన ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలలో గందరగోళం
ప్రభుత్వ లాంఛనం ప్రకారం అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమైన పోలీసులు
అంత్యక్రియలు జరుగుతుండగా ఖననం చేసే ప్రక్రియ మొదలు పెడుతుండగా పోలీసుల గౌరవ వందనం
పోలీసుల గౌరవ వందనాన్ని… pic.twitter.com/e8nT5EXWX8
