1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. My husband is the one who took my child away; what does Pawan Sir have to do with this?, Dr. Gayatri-s video

నా బిడ్డను ఎత్తుకుపోయింది నా భర్త, ఇందులో పవన్ సర్‌కి ఏంటి సంబంధం?: డాక్టర్ గాయత్రి వీడియో

Dr Gayatri
తన బిడ్డను ఎత్తుకెళ్లింది తన భర్తేననీ, ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేస్తే కొంతమంది పనిలేనివాళ్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సర్ ను ఇందులోకి లాగుతూ ప్రచారం చేస్తున్నారని డాక్టర్ గాయత్రి అన్నారు. విశాఖపట్టణానికి చెందిన డాక్టర్ గాయత్రికి ఆమె భర్తకు గత కొన్ని నెలలుగా విభేదాలు వున్నాయి. 
 
ఈ క్రమంలో సమస్యను పరిష్కరించుకుందామని, పెద్దమనుషుల మధ్య కూర్చుని మాట్లాడుకుందామని చెప్పి తన 23 నెలల బిడ్డను ఎత్తుకెళ్లిపోయాడని గాయత్రి ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్తపై పోలీసు స్టేషనులో కిడ్నాప్ కేసు పెట్టినట్లు వెల్లడించారు. ఐతే పవన్ సార్ డిపార్టుమెంట్లో మా అత్తగారు పనిచేస్తున్నారు. ఆమె డిపార్టుమెంటును అడ్డుపెట్టుకుని ఏదో చేద్దామని ప్రయత్నిస్తోందనీ, కానీ పోలీసులు ఎప్పటికప్పుడు కేసు పరిస్థితి గురించి తనకు అప్డేట్ ఇస్తున్నట్లు చెప్పారు.
About Writer
జయ
Content provider.... మరింత చదవండి
తర్వాతి కథనం
ఇస్రో శాస్త్రవేత్తలు ఎందుకు రాజీనామాలు చేస్తున్నారు : కేంద్రం ఆరా