సంబంధిత వార్తలు
- లీ చెయోంగ్ను కలిసిన నారా లోకేష్.. ఏపీలో పాదరక్షల తయారీ యూనిట్ వేగవంతం చేయాలి..
- హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు.. ఎలా?
- Andhra Pradesh Cricket Mania: ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్.. నారా లోకేష్ అదుర్స్
- ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలకు 2 లక్షల మంది విద్యార్థులు
- ఒకే రోజు ఎన్టీఆర్, పవన్ సినిమాలను ఒకే రోజు చూస్తాను.. నారా లోకేష్
Nara Lokesh : దక్షిణ కొరియా రోడ్‌షోలో నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఆయన అక్కడ పలువురు వ్యాపారవేత్తలు, సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. ఈ క్రమంలో, ఆయన అక్కడ ఒక ఆసక్తికరమైన పెట్టుబడుల ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
లోకేష్ నేతృత్వంలోని బృందం షూఆల్స్ , సోలమ్, అపాక్ట్, శాంసంగ్, ఎల్జీ, బూ యంగ్, హ్వాసుంగ్ వంటి అనేక సంస్థల ప్రతినిధులను కలిసి, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అవకాశాలను వారికి వివరించింది.
ఇప్పుడు మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకోబోతోంది. దక్షిణ కొరియాలోని సియోల్ నగరంలో పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో నిర్వహించే రోడ్‌షోలో లోకేష్ పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సౌత్ కొరియా బిజినెస్ ఫోరమ్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం జరుగుతోంది.
తర్వాతి కథనం
