అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర ఘటన.. నారా లోకేష్- పవన్ భేటీ..
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభమైనాయి. ఈ సమావేశాల్లో వైసీపీ అధినేత జగన్ స్వయంగా సమావేశానికి హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కానీ అసెంబ్లీ ప్రాంగణంలో జరుగుతున్న గందరగోళం, ఉద్రిక్తతల మధ్య ఆసక్తికరమైన దృశ్యం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరూ హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకున్నారు. లోకేష్ పవన్ అన్నా అంటూ ఆయనను ఆలింగనం చేసుకున్న ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
కూటమి ఏర్పడిన తర్వాత, లోకేష్- పవన్ కళ్యాణ్ మధ్య స్నేహం గురించి చెప్పే సంఘటనలు ఎన్నో జరిగాయి. మరోసారి, వారు తమ సోదర బంధాన్ని ప్రదర్శించడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. లోకేష్ కళ్యాణ్‌ను "పవన్ అన్నా" అని ప్రేమగా సంబోధిస్తారు.
"బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన రోడ్ మ్యాప్, రాబోయే ప్రాధాన్యతలపై తాము వివరణాత్మక చర్చ చేశామని ఈ సందర్భంగా నారా లోకేష్ అన్నారు. ఐక్య ఎన్డీఏ బృందంగా, ఆంధ్రప్రదేశ్‌కు వృద్ధి, సుపరిపాలన, ఉజ్వల భవిష్యత్తును అందించడానికి తాము అన్నీ విధాల నిబద్ధతతో కలిసి పని చేస్తామని లోకేష్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.