సంబంధిత వార్తలు
- రైల్వే ట్రాక్‌పై ఇద్దరు మహిళలు.. కాపాడాలనుకున్నారు.. కానీ నలిగిపోయారు.. (video)
- సమ్మెను విరమించిన టీజీఎస్సార్టీసీ ఉద్యోగులు.. ఊపిరిపీల్చుకున్న ప్రయాణీకులు
- తెలంగాణలో టీజీఎస్సార్టీసీ నిరవధిక సమ్మె.. మహిళలకే కాదు.. పురుష ప్రయాణీకులకు ఫ్రీ జర్నీ
- హైదారాబాద్ నుంచి బెంగళూరుకి విమానం, గాల్లోనే 4 గంటలు గిరికీలు, ప్రయాణికులు హాహాకారాలు (video)
- ప్రయాణికులకు షాకిచ్చిన ఎయిరిండియా - సర్ చార్జీ భారీగా పెంపు
పూర్తిగా దగ్ధమైన కావేరీ ట్రావెల్స్ బస్సు - డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులంతా క్షేమం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా ప్రైవేటు బస్సు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా రాజుపాలెం వద్ద కావేరీ ట్రావెల్స్‌కు చెందిన ఓ స్లీపర్ బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న ఈ బస్సు ఇంజిన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేసి, ప్రయాణికులను అలెర్ట్ చేశాడు. ఆ సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలు బస్సంతా వ్యాపించేలోపు ప్రయాణికులంతా దిగేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడటంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే, ఈ యేడాది ఏపీలో జరిగిన వరుస ప్రమాదాలు రవాణా భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. గత మార్చి 26వ తేదీన మార్కాపురం జిల్లా జరిగిన ఘోర ప్రమాదంలో ప్రైవేట్ బస్సు టిప్పర్ లారీనీ ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 13 మంది మృత్యువాతపడ్డారు. అలాగే, మే 14వ తేదీన తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్రగూడెం వద్ద జరిగిన మరో ప్రమాదంలో ప్రైవేట్ బస్సును టిప్పర్ ఢీకొట్టగా ఒకరు మృతి చెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ వరుస ఘటనలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నిర్వహణ, రహదారి భద్రతా నియమాల అమలుపై పలు సందేహాలను లేవనెత్తుతున్నాయి.
