తెలుగు రాష్ట్రాల మీదుగా అమృత్ భారత్ స్లీపర్ క్లాస్ రైలు
రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానిస్తూ అమృత్ భారత్ స్లీపర్ క్లాస్ రైలు సేవలను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రారంభించారు. అస్సోం రాష్ట్రంలోని కామాఖ్య నుంచి తెలంగాణ రాష్ట్రంలోని చర్లపల్లి ప్రాంతాల మధ్య ఈ రైలు నడుస్తుంది. అతి తక్కువ చార్జీతో ఈ రైలులో సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చు. ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాల వైపు వెళ్లే ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.
ఈ రైలు మార్గమధ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని శ్రీకాకుళం రోడ్డు, విజయనగరం జంక్షన్, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, గుడివాడం, విజయవాడ, గుంటూరు, నల్గొండ స్టేషన్‌లలో ఆగి వెళుతుంది. ఈ రైలును ప్రధాని మోడీ అస్సోంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ రైలులో స్లీపర్, సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి.