సోమవారం, 9 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 మార్చి 2026 (15:06 IST)

ఎంతో ఘనంగా జరిగిన రెండో పెళ్లి.. నాలుగో రోజే వరుడు ఆత్మహత్య

marriage
చిత్తూరు జిల్లాలో ఘోరం జరిగింది. పెళ్లైన నాలుగు రోజులకే వరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. జె. మురళి అనే యువకుడు సీఎస్‌సీ కేంద్రంలో ఆపరేటర్‌గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. గతంలో మొదటి భార్యతో విడాకులు తీసుకున్న మురళికి, కుటుంబ సభ్యులు ఫిబ్రవరి 25న సుజాత అనే యువతితో రెండో వివాహం జరిపించారు. ఫిబ్రవరి 28వ తేదీన ఎప్పటిలాగే పనికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన మురళి తిరిగి రాలేదు. దీంతో కంగారుపడ్డ కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
అదే సమయంలో బైరెడ్డిపల్లె పెద్దచెరువు ఒడ్డున చెప్పులు ఉండటాన్ని గమనించిన జాలర్లు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు చెరువులో గాలించగా మురళి మృతదేహం లభ్యమైంది. వివాహమైన కొద్ది రోజుల్లోనే మురళి ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో భార్య సుజాత, కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. 
 
ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుక తర్వాత, కొత్త దంపతులు తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభించకముందే ఈ ఘోరం జరిగిపోయింది. ఇళ్లంతా బంధువులు, మిత్రులతో సందడిగా ఉన్న సమయంలో వరుడు బలవన్మరణానికి పాల్పడటం శోకాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.