1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. No respite despite securing bail twice: Andhra Pradesh police arrest ‘Prashna’ Raavan for the third time

పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు ప్రశ్న రావణ్ అరెస్ట్.. ఇదేంటని ప్రశ్నించిన ప్రకాష్ రాజ్

Prashna Raavan
Prashna Raavan
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ప్రముఖ యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను అరెస్ట్ చేశారు. మచిలీపట్నం 31వ డివిజన్ జనసేన ఇన్‌ఛార్జ్ ఉడుముల బుజ్జి ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున నిందితుడు ప్రశ్న రావణ్‌ను కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ఇనకుదురు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇకపోతే.. ప్రశ్న రావణ్ తరలింపు నేపథ్యంలో ఇనకుదురు పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల కఠిన ఆంక్షలు విధించారు. స్టేషన్ ప్రధాన గేట్లు మూసివేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 
 
మరోవైపు యూట్యూబర్ రావణ్‌పై కేసులు సరికాదని విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. ఈ కేసులో అరెస్ట్ చేయలేమని కోర్టులు చెబుతున్నాయి. ఇంకా ఇలాంటి కేసుల్లో కోర్టులు బెయిల్ ఇస్తున్నా వరుస కేసులు పెడుతున్నారని ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. రావణ్‌పై 30 కేసులు రెడీగా ఉన్నాయంటున్నారు. ఈ వ్యవహారం సిగ్గులేని కక్షసాధింపు చర్యేనని ప్రకాష్ ఫైర్ అయ్యారు. రావణ్‌ను వదిలేస్తారని ఆశిస్తున్నానని.. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఎంత దూరం వెళ్తారని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. 
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి