చనిపోయిన తండ్రి కోర్కె తీర్చడం కోసం సిగరెట్ దమ్ము కొట్టి నైవేద్యం పెట్టిన కుమార్తె, వీడియో
స్వర్గస్తులైన పెద్దవారికి సంవత్సరికాలు, వర్థంతులు చేయడం చాలామంది చేసేదే. ఐతే వీటిని కొందరు చేసే తీరు చూస్తుంటే ఈ కలియుగం తీరు ఇలా ముందడుగు వేస్తుందా అనే యోచన రాక మానదు. ఇక అసలు విషయానికి వస్తే... చనిపోయిన తండ్రికి ఓ కూతురు సంవత్సరికం సందర్భంగా చేసిన పని షాకిచ్చే విధంగా వుంది. ఆమె చేసిన పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఆ వీడియోలో... తండ్రి పటానికి పూల మాల వేసింది. ఫోటో ముందు స్వీట్లు, పండ్లు ఇతర తినబండారాన్ని ఉంచింది. ఆయనకు సిగరెట్ అంటే చచ్చేంత ఇష్టమట. అందుకని చనిపోయిన తర్వాత కూడా ఆయన కోర్కె తీర్చేందుకై కుమార్తె స్వయంగా సిగరెట్టును కాల్చింది. అంతేకాదు... గట్టిగా రెండుమూడు దమ్ములు కొట్టి ఆ సిగరెట్టును తండ్రి ఫోటో ముందు వుంచింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏమిటి...?
చనిపోయిన తండ్రికి సిగరెట్ తో నైవేద్యం.
— AVM (@AvmNews7) June 4, 2026
రోజు రోజుకు మనుషులకి పిచ్చి ముదురుతోంది అనాలా లేక ఎవరి ఇష్టం వాళ్లది అంటారా ???? pic.twitter.com/xGaBxpz9gZ
