శనివారం, 15 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 14 నవంబరు 2025 (19:26 IST)

Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)

Mangalam Peta lands
నాకు తెలియక అడుగుతా... చుట్టుపక్కల అడవి. అటువైపు కొండలు, ఇటువైపు కొండలు. మధ్యలో వారసత్వం ద్వారా వచ్చిన భూమి అంటున్నారు. అసలు అది ఎలా వచ్చిందో నాకు నివేదిక పంపండి అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. పవన్ కల్యాణ్ ప్రశ్నతో ఇపుడీ చర్చ ప్రజల్లోకి కూడా బలంగా వెళ్లిపోయింది. సోషల్ మీడియా వేదికగా ఆ భూమి గురించి చర్చలు చేస్తున్నారు. దానికి Operation Aranya అంటూ ట్యాగ్ లైన్ జోడించి చర్చిస్తున్నారు.
 
మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అటవీ భూములను కొందరు కబ్జా చేసారంటూ ఏపీ అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ చలపతి రావు మీడియా సమావేశంలో చెప్పారు. చిత్తూరు జిల్లా మంగళం పేటలో ఏకంగా 32.63 ఎకరాల భూమిని పెద్దిరెడ్డి కుటుంబం ఆక్రమించుకున్నదని ఆయన చెప్పారు. ఆ భూమిని స్వాధీనం చేసుకుంటామనీ, ఎక్కడ ఆక్రమణలు జరిగినట్లు తేలినా ఆ భూములన్నింటినీ వెనక్కి తీసుకుంటామని అన్నారు.
 
ప్రస్తుతం కొన్ని రిట్ పిటీషన్లపై కోర్టులో వాదనలు జరుగుతున్నట్లు వెల్లడించారు. పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల పేర్లతో మొత్తం 74 ఎకరాలు వుండగా ఈ భూములను ఆనుకుని వున్న 32.63 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుని అందులో మామిడి, ఉద్యాన పంటలు సాగుచేసినట్లు గుర్తించి వాటన్నిటినీ తొలగించనట్లు చెప్పారు. అటవీ భూముల వివరాలన్నింటినీ వెబ్ ల్యాండులో పెడతామనీ, అటవీ భూములకు సంబంధించి సంపూర్ణ వివరాలు ప్రజలకు తెలిసేటట్లు చేస్తామని ఆయన అన్నారు.