సంబంధిత వార్తలు
- Heavy Rain Likely Across AP: ఏపీలో ఒకవైపు వర్షాలు.. ఒకవైపు ఎండలు
- మహిళను బెదిరించి అన్నాదమ్ముల అత్యాచారం
- ఒంటరి మహిళపై అత్యాచారం - సీఐ పరారీ... ఆచూకీ కనిపెట్టని పోలీసులు
- వైకాపా మాజీ మంత్రి రజనీపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు - పాస్‌పోర్టు అప్పగింత
- పల్నాడు చౌడేశ్వరి కేసు.. మాచర్ల సీఐ వెంకట రమణపై సస్పెన్షన్ వేటు
వైకాపా ప్రభుత్వంలో రెచ్చిపోయిన తురకా రమేష్‌పై నకిలీ పట్టా కేసు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా వైకాపా నేత, మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్‌పై కేసు నమోదైంది. తురకా కిషోర్ డబ్బులు తీసుకుని, నకిలీ ఇంటి పట్టా ఇచ్చారని మాచర్ల పట్టణం నెహ్రూ నగర్‌కు చెందిన విజయబాబు, శ్రీను నాయక్‌లు ఆరోపించారు.
గత 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రింగు రోడ్డు సమీపంలోని గ్యాస్ గోదాము ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమికి తన సమీప బంధువు చల్లా శివ ద్వారా తురకా కిషోర్ నకిలీ పట్టా ఇచ్చి తమను మోసం చేశారని బాధితులు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డికి ఫిర్యాదు చేశారు.
దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ సిబ్బంది, పోలీసులను ఎమ్మెల్యే ఆదేశించారు. విచారణ జరిపిన అధికారులు... వాస్తవమేనని తేల్చడంతో బాధితుల ఫిర్యాదు మేరకు మాచర్ల పోలీస్ స్టేషన్‌లో తురకా కిషోర్, అతని బంధువు చల్లా శివపై కేసు నమోదు చేశారు.
మమతా బెనర్జీ ప్రధాని కావాలన్న ఎంపీ.. తిరుగుబాటు వర్గంలో చేరిపోయారు...
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత సంక్షోభం తారా స్థాయికి చేరింది. దీంతో 20 మంది ఎంపీలు మమతకు షాకిచ్చి ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. తాజాగా పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి అత్యంత విధేయురాలిగా, ప్రధాన మద్దతుదారుగా గుర్తింపు పొందిన యువ ఎంపీ సాయోని ఘోష్ అనూహ్యంగా తిరుగుబాటు వర్గంలో చేరడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ పరిణామం మమతా నాయకత్వానికి కోలుకోలేని దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 15 ఏళ్ల తర్వాత బీజేపీ చేతిలో టీఎంసీ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమి అనంతరం పార్టీ నాయకత్వంపై, ముఖ్యంగా మమత మేనల్లుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై పలువురు సీనియర్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ ఎంపీ కాకోలీ ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో సుమారు 20 మంది ఎంపీలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. లోక్‌సభలో మొత్తం 28 మంది టీఎంసీ సభ్యులలో ఇంత పెద్ద సంఖ్యలో ఎంపీలు వ్యతిరేకత తెలపడం పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.
జాదవూర్ ఎంపీ సాయోని ఘోష్ ఇప్పటివరకు మమతా బెనర్జీకి వెన్నంటి నిలిచారు. భవిష్యత్తులో మమత ప్రధాని కావాలంటూ బలంగా వాదించిన ఆమె, ఇప్పుడు తిరుగుబాటు వర్గానికి మద్దతుగా సంతకం చేసి, ఢిల్లీలో మకాం వేయడం గమనార్హం. టీఎంసీ పార్లమెంటరీ పార్టీ నేతగా అభిషేక్ బెనర్జీని తొలగించి, ఆ స్థానంలో కాకోలీని నియమించాలని కోరుతూ తిరుగుబాటు ఎంపీలు ఇప్పటికే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ సమర్పించారు.
మరోవైపు, తాము బీజేపీలో చేరబోమని, అయితే జాతీయ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అవసరమైనప్పుడు ఎన్డీఏకు మద్దతు ఇస్తామని రెబల్ ఎంపీలు స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో, అభిషేక్ బెనర్జీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వంటి విపక్ష నాయకులతో సమావేశమవుతూ మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే, తిరుగుబాటు వర్గం పేర్కొంటున్న సంఖ్యాబలంపై మమతా వర్గం తీవ్ర సందేహాలు వ్యక్తం చేస్తోంది.
