1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Pawan Fans Just Asking : Pawan Kalyan Questions to Prakash Raj

డిపాజిట్లు గల్లంతైన వారూ ప్రశ్నిస్తారా? పవన్ ఫ్యాన్స్ 'జస్ట్ ఆస్కింగ్'

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ''వస్తానంటే వద్దంటామా.. రండి సార్.. కానీ అంతకంటే ముందు ఒకటి చెప్పండి. మీరు ఉత్తుత్తినే వస్తున్నారా? లేక పొత్తుతో వస్తున్నారా...? సింగిల్‌గా వస్తున్నారా? ఊరికే అడుగుతున్నా..." అంటూ ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి తన స్నేచర్ హ్యాష్‌ట్యాగ్‌ జస్ట్ ఆస్కింగ్‌ను కూడా జతచేశారు. 
 
ఈ ట్వీట్ చేయగానే సోషల్ మీడియాలో వేదికగా పెద్ద ఎత్తున చర్చ, రచ్చ మొదలైంది. పవన్ అభిమానులు ప్రకాష్ రాజ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడే ముందు గతంలో బెంగుళూరులో పోటీ చేసినపుడు కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయిన మీ చరిత్రను ఒక్కసారి గుర్తుచేసుకోవాలంటూ నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. పవన్ ఎలా వస్తేమీకెందుకు అంటూ ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. 
pawan kalyan
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
రేయ్ జోస్ బ్రో, రాత్రి నా బెడ్రూంలో నా పెళ్లాంతోనే గడుపుతావా? అయ్యో నా భార్యను చంపేసాను, ఇప్పుడు నేను కూడా... వీడియో