సంబంధిత వార్తలు
- పవన్ గారూ... మీ అమరావతిలో మీ సీఎం కుర్చీ కిందకి నీళ్లు రాకుండా చూస్కోండి: కవిత ఎగతాళి
- పవన్ కల్యాణ్ పేరును ముష్టి ఎత్తుకోకపోతే మీకు పాపులారిటీ రాదు: సినీ నటి మాధవీలత షాకింగ్ కామెంట్స్
- Pawan Kalyan: సేన గళం అనే కమిటీ ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్
- పవన్ ఎలాంటివారో ప్రపంచానికి చెప్పేందుకు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నా: బండ్ల గణేశ్
- తెలంగాణాలో బతకాలంటే ప్రత్యేక పాస్‌పోర్టు కావాలా? బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి
దక్షిణ తీర కొత్త రైల్వే జోన్... స్వాగతించిన పవన్ కల్యాణ్, మాధవ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ దక్షిణ తీర రైల్వే జోన్ కార్యకలాపాలను స్వాగతించారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కు, దాని ప్రజలకు గర్వకారణమని వారు అభివర్ణించారు. విశాఖపట్నాన్ని ప్రధాన కేంద్రంగా కలిగిన ఈ కొత్త రైల్వే జోన్‌ను పవన్ కళ్యాణ్ ఎక్స్ ద్వారా ప్రశంసించారు.
ఆంధ్రప్రదేశ్‌కు మెరుగైన అనుసంధానం, అధిక సామర్థ్యం, వేగవంతమైన అభివృద్ధి దిశగా ఒక ముఖ్యమైన ముందడుగుగా, ఈ రోజు విశాఖపట్నం నుండి తన కార్యకలాపాలను ప్రారంభిస్తున్న దక్షిణ తీర రైల్వే జోన్‌ను తాము హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని తెలిపారు.
భారతీయ రైల్వే 18వ జోన్‌గా, ఇది రాష్ట్రవ్యాప్తంగా రైలు మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది. ప్రాంతీయ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ప్రాంతంలో సమతుల్య అభివృద్ధికి దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి ఎక్స్ పోస్టులో వెల్లడించారు.
ఈ చిరకాల ఆకాంక్షను సాకారం చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు జనసేనాని ధన్యవాదాలు తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కు, దాని ప్రజలకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
విశాఖపట్నాన్ని ప్రధాన కేంద్రంగా చేసుకుని దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ప్రారంభించడంతో, ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రజల చిరకాల స్వప్నం ఎట్టకేలకు సాకారమైందని పీవీఎన్ మాధవ్ అన్నారు.
