శుక్రవారం, 23 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 డిశెంబరు 2025 (13:15 IST)

మంగళగిరిలో కానిస్టేబుల్ నియామక పత్రాల పంపిణీ.. పవన్, బాబు, అనిత ఫోటోలు వైరల్

Pawan_Babu_anitha
Pawan_Babu_anitha
మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో కానిస్టేబుల్ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. 
 
కొత్తగా ఎంపికైన 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఖాకీ యూనిఫాం సమాజానికి ఒక రక్షణ కవచంలా నిలుస్తుందని, కానిస్టేబుల్ పదవి పోలీసు వ్యవస్థకు వెన్నెముక లాంటిదని అన్నారు. 
Pawan Kalyan
Pawan Kalyan
 
నూతనంగా నియమితులైన వారు క్రమశిక్షణతో, నిజాయితీతో ప్రజలకు సేవ చేయాలని ఆయన కోరారు. పోలీసు బలగాలకు సంకీర్ణ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.