సంబంధిత వార్తలు
- అవకాశాలు లేక వెనుకబడిన హీరోయిన్... అయినా పవన్ చిత్రంలో గోల్డెన్ ఛాన్?
- Ambani Hospital: అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్.. ఎందుకు?
- ఒకవేళ పవన్ కల్యాణ్ హోం మంత్రి అయితే.. ఆర్ఆర్ఆర్ సెన్సేషనల్ కామెంట్లు
- శ్రీవారి సేవలో అనంత్ అంబానీ... శ్రీనివాసుడికి భారీ విరాళం
- వైకాపాకు తెలిసిన ఏకైక మంత్రం తిట్ల దండకమే : పవన్ కళ్యాణ్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతి కండరాలకు తీవ్ర గాయం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతి కండరాలకు తీవ్ర గాయమైంది. దీంతో ఆయనకు తక్షణం సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. అయితే, రాష్ట్రానికి సంబంధించిన అనేక అధికారిక కార్యక్రమాలు, పరిపాలను విధులను పూర్తి చేసిన తర్వాత ఆపరేషన్ చేయించుకుంటానని వైద్యులకు చెప్పారు.
సోమవారం నాడు తన భార్య అన్నా లెజినోవాతో కలిసి పవన్ ముంబైలోని కోకిలా బెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రికి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయనకు వివిధ రకాలైన వైద్య పరీక్షలు చేశారు. ఆయన రెండు భుజాలను క్షుణ్ణంగా పరీక్షించిన వైద్య బృందం, రొటేటర్ కఫ్‌తో పాటు చేతికి సంబంధించిన రెండు కండరాలకు తీవ్ర గాయమైనట్టు గుర్తించింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నందున, తక్షణమే శస్త్రచికిత్స చేయించుకోవడం ఉత్తమమని వైద్యులు సిఫార్సు చేశారు. ఈ మేరకు ఆయనకు పూర్తి నివేదికను అందజేశారు.
అయితే, వైద్యుల సూచనపై స్పందించిన పవన్ కల్యాణ్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. ముందుగా నిర్దేశించుకున్న ప్రభుత్వ కార్యక్రమాలను, పరిపాలనా బాధ్యతలను పూర్తి చేయడం తన కర్తవ్యమని ఆయన భావించారు. ఈ కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాతే శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో చేరతానని తెలిపారు. ఈ మేరకు అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసుకుని తిరిగి వస్తానని ఆయన పేర్కొన్నారు.
కాగా, పవన్ కల్యాణ్ గత కొంతకాలంగా చేతి నొప్పితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. రెండు చేతుల కండరాలు పూర్తిగా దెబ్బతినడంతో పాటు, రొటేటర్ కఫ్ గాయంతో ఆయన అసౌకర్యానికి గురవుతున్నారు. ఎన్నికల ప్రచార సమయంలోనూ ఈ నొప్పి ఆయనను వేధిస్తోంది.
