సంబంధిత వార్తలు
- VarunTej: వాలీబాల్ శిక్షణలో మోకాలికి గాయమైన వరుణ్ తేజ్‌కు శస్త్రచికిత్స
- నారీ శక్తి వందన్‌కు మద్దతు ఇవ్వండి : టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు లేఖ
- Rajinikanth : జైలర్ 2లో షారుఖ్ ఖాన్ ప్లేస్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడా ?
- నా భార్యను కారుతో పోల్చిన జగన్.. ప్రజలు ఇంకా మరవలేదు.. మాటలకు బరువెక్కువ: పవన్
- ఒకరికి పుట్టినరోజు.. మరొకరికి పునర్జన్మ : పవన్ కళ్యాణ్ సతీమణి
కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు- పవన్ కళ్యాణ్
గోదావరి పుష్కరాలు 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయి కాబట్టి, కుంభమేళా తరహాలో అత్యంత వైభవంగా వీటిని నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు.
మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం నాడు గోదావరి పుష్కరాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ప్రస్తావించారని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
భక్తుల భద్రతకు భరోసా కల్పించడంతో పాటు, వారికి అన్ని రకాల మౌలిక సదుపాయాలను సమకూర్చాలని ఉప ముఖ్యమంత్రి ఆకాంక్షించినట్లు దుర్గేష్ తెలిపారు.
2027లో జరిగే గోదావరి పుష్కరాల్లో సుమారు 10 కోట్ల మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి, రాజమహేంద్రవరంలో త్వరలోనే ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులతో పవన్ కళ్యాణ్ ఒక సమీక్షా సమావేశం నిర్వహిస్తారని మంత్రి పేర్కొన్నారు.
