సంబంధిత వార్తలు
- బిజినెస్మేన్ భార్యను లొంగదీసుకుని ఏకాంతంగా వున్న ఫోటోలను చూపి బ్లాక్మెయిల్, రూ. 2 కోట్లు డిమాండ్
- ఏప్రిల్ 14న ప్రపంచ క్వాంటం దినోత్సవం.. క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్ల ప్రారంభం
- సైకో వీరంగం.. హతమార్చిన గ్రామస్థులు...
- కోతులకు పెట్టిన విషపూరిత ఆహారం ఆరగించి చిన్నారి మృతి
- ఏపీ ఐటీ రంగంలో కీలక పరిణామం - వైజాగ్లో ఐబీఎం సేవలు
నారీ శక్తి వందన్‌కు మద్దతు ఇవ్వండి : టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు లేఖ
పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్టీకి చెందిన రాజ్యసభ, లోక్‌సభ్యులు మద్దతు ఇవ్వాలని టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఎంపీలందరికీ లేఖలు రాశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు నారీ శక్తి వందన్‌కు పార్లమెంట్‌లో మద్దతు తెలుపాలని లేఖలో కోరారు.
'మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పాన్ని బలపరుద్దాం. బిల్లు ప్రవేశపెట్టే ఈ నెల 16వ తేదీ భారత ప్రజాస్వామ్యంలో చారిత్రక ఘట్టం. నారీ శక్తి వందన్ అధినియం మహిళా సాధికారతకు, దేశ ఉన్నతికి దోహదపడుతుంది. ప్రభుత్వం, పరిపాలన, చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలి. అప్పుడే నిజమైన ప్రగతి సాధ్యంట అని సీఎం పేర్కొన్నారు.
ఇదిలావుంటే, సీఎం చంద్రబాబు తన సొంత పార్టీ ఎంపీలకు మాత్రమే కాకుండా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రాం మాధవ్, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు ఆయన లేఖలు రాశారు.
ఫస్ట్ నైట్ షాక్.. శోభనం జరగాలంటే రూ.90 లక్షలు చెల్లించాల్సిందే..
ఓ నవ వధువు కట్టుకున్న భర్తకు తేరుకోలేని షాక్ ఇచ్చింది. తన మెడలో మూడు ముళ్లు వేసిన భర్తతో శోభనం చేసేందుకు డబ్బులు డిమాండ్ చేసింది. తనతో శోభనం కావాలంటే రూ.90 లక్షలు చెల్లించాల్సిందేనంటూ పట్టుబట్టుంది. దీంతో భర్త శోభనం రోజు రాత్రే తేరుకోలేని షాక్‌కు గురయ్యాడు. అంతేకాదండోయ్.. ఏకంగా కట్టుకున్న భర్తను, అతని కుటుంబ సభ్యులను ఒక యేడాది పాటు వేధించింది. మానసికక్షోభకు గురిచేసింది. చివరకు భర్తను, అతని కుటుంబాన్ని సజీవదహనం చేసేందుకు యత్నించిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఆగ్రాకు చెందిన యువకుడికి గతేడాది ఏప్రిల్ 29న కల్పన అనే యువతితో వివాహం జరిగింది. శోభనం రోజు రాత్రి గదిలోకి వెళ్లాక, తనకు రూ.90 లక్షల నగదు ఇస్తేనే ముసుగు తీస్తానని ఆమె భర్తకు షరతు పెట్టింది. అంత పెద్ద మొత్తం ఇవ్వడం కుదరదని అతను స్పష్టం చేయడంతో, మరుసటి రోజే ఆమె పెళ్లి నగలన్నింటితో పుట్టింటికి వెళ్లిపోయింది.
అప్పటి నుంచి ఏడాది పాటు కల్పన, ఆమె కుటుంబ సభ్యులు వరుడిని వాట్సాప్ ద్వారా బెదిరిస్తూ, ఇంటిపై దాడులు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చి 26న కల్పన తండ్రి, సోదరుడు వరుడి ఇంటికి వచ్చి గొడవకు దిగారు. ఉద్దేశపూర్వకంగా ఇంట్లోని వంట గ్యాస్ పైపులైనును ధ్వంసం చేసి, నిప్పు అంటించి కుటుంబాన్ని సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో వరుడితో పాటు అతని తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదు. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం జోక్యంతో, ఆగ్రా పోలీసులు తాజాగా వధువు కల్పనతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై హత్యాయత్నం, బలవంతపు వసూళ్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
