గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 జనవరి 2026 (11:06 IST)

ఎన్టీఆర్ సినీ వినీలాకాశంలో ధృవతార - రాజకీయాల్లో అజేయుడు : సీఎం చంద్రబాబు

chandrababu naidu
స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్థంతి వేడుకలను పురస్కరించుకుని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నగరంలోని ఎన్టీఆర్ ఘాట్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ గురించి తన ఎక్స్ వేదికలో ఓ పోస్ట్ చేశారు. 
 
'ఎన్టీఆర్‌.. సినీ వినీలాకాశంలో ధ్రువతార.. రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడు. తరతరాల చరిత్రను తిరగరాసిన ధీరోదాత్తుడు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటం ప్రాతఃస్మరణీయం. రెండు రూపాయలకు కిలో బియ్యం, సామాజిక భద్రతా పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతులకు విద్యుత్, మండల వ్యవస్థతో స్థానిక స్వపరిపాలన, ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, రాయలసీమకు సాగు, తాగునీటి ప్రాజెక్టులులాంటి అనితరసాధ్యమైన సంక్షేమ అభివృద్ధి పథకాలతో చరిత్ర గతిని మార్చిన ఆ మహనీయుడు మనకు ఆదర్శం. ఆయన వేసిన బాట మన అందరికీ అనుసరణీయం' అని చంద్రబాబు పేర్కొన్నారు.