ఆ చిన్నారికి ఒక్క ఇంజెక్షన్ రూ. 16 కోట్లు, రూ. 10 కోట్లు వచ్చాయ్, మిగిలిన డబ్బు సాయం: నారా లోకేష్
కర్నూలుకు చెందిన దంపతులు తమ బిడ్డ పుర్వికకు అరుదైన ఎస్ఎమ్ఎ టైప్ -1 వ్యాధి సోకిందనీ, తమ బిడ్డ పూర్తిగా కోలుకునేందుకు రూ. 16 కోట్లు ఖరీదు చేసే ఇంజెక్షన్ ఇవ్వాలని సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. దాతలు తమకు మద్దతు ఇవ్వాలనీ, తమ బిడ్డ ప్రాణాలను కాపాడాలంటూ వేడుకున్నారు. వారు సోషల్ మీడియాలో తమ బాధను వ్యక్తం చేయడంతో పాప చికిత్స కోసం పలువురు దాతలు పెద్దమనసు చేసుకుని దాదాపు రూ. 10 కోట్ల వరకూ డబ్బు సాయం చేసినట్లు పాప తండ్రి వెల్లడించారు. మిగిలిన డబ్బును కూడా సాయం చేయాలంటూ మంత్రి నారా లోకేష్ కు విన్నవించుకున్నారు.
వారి బిడ్డ క్షేమంగా వుండాలనీ, అరుదైన ఆ వ్యాధి నుంచి పూర్తి కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ X పేజీలో తెలియజేసారు. ఇందుకుగాను దాతలు మిగిలిన రూ. 6 కోట్లను కూడా బిడ్డ చికిత్స కోసం అందించాలంటూ కోరారు. రూ. 10 కోట్లు సాయం చేసిన ప్రతి ఒక్క దాతకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.