గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : సోమవారం, 14 సెప్టెంబరు 2015 (13:58 IST)

మూసి ఉన్న ఏటీఎం మూసినట్టే... రూ. 32లక్షలు మాయం... ఎలా..?

మూసిన ఏటీఎం మూసినట్లే ఉంది. దాని సీలు తెగలేదు.. లావాదేవీలు జరుగలేదు. కానీ అందులోని రూ.32లక్షల అమౌంట్ మాత్రం మాయమయ్యింది. ఇది సాంకేతిక లోపమా.. లేక సిబ్బంది చేతి వాటమా..? ఎలా జరిగింది. తూర్పు గోదావరి జిల్లాల రావులపాలెం మండలంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి
 
రావులపాలెం మండలకేంద్రంలోని సీఆర్‌సీ రోడ్డులో ఎస్‌బీఐ ఏటీఎం ఉంది. అందులో రోజూ సిబ్బంది డబ్బుల ఏర్పాటు చేస్తారు. ఈ ఏటీఎం కెపాటిసీ రూ.38 లక్షలు. బ్యాంకు సమయాన్ని బట్టి ఎంత మనీ తగ్గితే అంత మనీ ఏటీఎంలో పెడతారు. అదే విధంగా డబ్బులు ఏర్పాటు చేశారు. ఆ తరువాత సీలు వేసి వెళ్ళిపోయారు. అంత పెద్దగా లావాదేవీలేమి జరుగులేదు. ఏటీఎంను ధ్వంసం చేసిన ఆనవాళ్లు లేవు. 
 
ఏటీఎంలో దొంగతనం జరగలేదు. కానీ అందులో ఉండాల్సిన రూ.32 లక్షల 75 వేల 200 మాయమయినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఇదేలా సాధ్యం అనేది పెద్ద ప్రశ్న. సాంకేతిక లోపం కారణంగానైనా లెక్కల్లో తేడా ఉండాలి. లేదా నగదు అందులో ఏర్పాటు చేసే సిబ్బంది చేతివాటమైన అయి ఉండాలి. ఏదిఏమైనా అధికారులు మాత్రం రావులపాలెం పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.