1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Shocking Crime in Telangana | Six Killed in Daivalaguda

దైవాలగూడలో వరుస హత్యలు - వైరల్ అవుతున్న వీడియో

murder case
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా షాబాద్, దైవాలగూడ ప్రాంతంలో జరిగిన ఘోర వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ హత్యలకు పాల్పడిన నిందితుడు రాజ్‌కుమార్ (28) బాలికను బలవంతంగా లాక్కెళుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దైహాలగూడలో రాత్రి 11 నుంచి అర్థరాత్రి ఒంటి గంట వరకు ఈ నరమేథానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి, అమ్మమ్మన తొలుత హత్య చేసిన నిందితుడు.. ఆ తర్వాత బాలికను బలవంతంగూ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు వద్దకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. పిమ్మట తన తండ్రికి ఫోన్ చేసి వరుస హత్య గురించి చెప్పాడు. 
 
మరోవైపు, ఈ ఘోర హత్యల ఘటనపై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాజస్థాన్ పర్యటనలో ఉన్న మంత్రి, ఘటన వివరాలు తెలియగానే సంబంధిత పోలీస్ కమిషనరుతో ఫోన్ ద్వారా మాట్లాడి సమాచారం సేకరించారు. నిందితుడిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని, కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు.
 
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధితులకు తక్షణం సహాయం అందించాలని, మానసిక-సామాజిక తోడ్పాటు కల్పించాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను సూచించారు. మహిళలు, పిల్లల భద్రతకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, నేరస్థులు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని సీతక్క హెచ్చరించారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుందని స్పష్టం చేశారు.
 
కేసు వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన దారుణ హత్యల వెనుక పోక్సో కేసు కక్ష ఉందని పోలీసు దర్యాప్తు వెల్లడైంది. నిందితుడు రాజ్కుమార్ (28) తనపై పోక్సో కేసు నమోదు చేసి జైలు పంపిన బాలిక, ఆమె తల్లి, నానమ్మను కత్తితో నరికి చంపాడు. అనంతరం తన భార్య సరిత (పార్వతి సరిత), 3 ఏళ్ల కుమార్తె, 2 ఏళ్ల కుమారుడిని కూడా కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘోర ఉదంతంలో మొత్తం ఆరుగురు మృతి చెందారు.

 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
గుర్తు తెలియని ఎగిరే వస్తువులు - కొత్త ఫైళ్లను విడుదల చేసిన పెంటగాన్