సంబంధిత వార్తలు
- OG2 : తుఫాను రాకముందు.. ఒక నిశ్శబ్ద క్షణం అంటూ.. ఓజీ 2 అప్ డేట్
- నటుడు ప్రకాష్ రాజ్‌కు నాలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కు - నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
- ధర్మస్థల కేసు : చిన్నయ్యకు తనకు ఎలాంటి సంబంధం లేదు : ప్రకాష్ రాజ్
- మేం జంతువులం కాదు మౌనంగా ఉండటానికి : ప్రకాష్ రాజ్
- పవన్‌ను దొర అంటూ ప్రకాష్ రాజ్ వ్యంగ్యాస్త్రాలు - కర్రుకాల్చి వాత పెట్టిన నటి హేమ (Video)
ఆంధ్రలో అలజడి సృష్టించేందుకు కొందరు కుట్రలు, ప్రకాష్ రాజ్‌ను నిషేధించాలి: విష్ణువర్థన్ రెడ్డి
ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే కొన్ని శక్తులు రాష్ట్రంలో అలజడి సృష్టించాలని కుట్రలు పన్నుతున్నట్లు అర్థమవుతోందని భాజపా నాయకుడు విష్ణువర్థన్ రెడ్డి అన్నారు. ముఖ్యంగా సినీ నటుడు ప్రకాష్ రాజ్‌ను సినీ ఇండస్ట్రీ నుంచి వెలివేయాలని అన్నారు.
మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యక్తులకు ప్రకాష్ రాజ్ మద్దతు తెలపడం చూస్తుంటే ఆయన ఎలాంటి వ్యక్తో అర్థమవుతుందని సినీ పరిశ్రమలో చోటు లేకుండా చేయాలని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకులను నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే వారిపై చర్య తీసుకోకూడదు అంటూ ప్రకాష్ రాజ్ చెప్పడం విడ్డూరంగా వుందని అన్నారు. అందుకే ఇట్లాంటి వారిని సినీ పరిశ్రమ నుంచి బహిష్కరించాలని అన్నారు.
యూ ట్యూబర్ రావణ్ సీఎం చంద్రబాబును, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, స్వామీజీలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అతడిపై చర్యలు తీసుకోవడాన్ని తాము సమర్థిస్తున్నట్లు చెప్పారు. రావణ్ పైన పోలీసులు చర్యలు తీసుకుంటే దాన్ని ప్రశ్నిస్తూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేయడం సిగ్గుచేటు అని అన్నారు.
