సంబంధిత వార్తలు
- హృద్రోగంతో చనిపోతే నీవు అనాథవు అవుతావు.. భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న వృద్ధ భర్త
- మద్యం తాగొద్దన్న తల్లి - చంపేసిన కుమార్తె.. ఎక్కడ?
- అడగ్గానే ఫ్రిజ్లో నీళ్లు ఇవ్వలేదని అమ్మను చంపేశాడు...
- కుటుంబ కలహాలు.. బిస్కెట్లలో ఎలుకల మందు పెట్టి ఇద్దరు పిల్లల్ని చంపేసిన తల్లి
- మా అల్లుడు ఓ సైకో, భార్య బ్యాగులో ట్రాకర్ పెట్టేవాడు: రాధా గాయత్రి తల్లి ఆవేదన
సుగాలి ప్రీతి కేసు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పైన సుగాలి ప్రీతి తల్లి పోలీసులకు ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పైన సుగాలి ప్రీతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసారు. 2017లో కర్నూలు లోని ఓ ప్రైవేటు స్కూలులో సుగాలి ప్రీతి ఆత్మహత్య కేసు విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ రోజుకోరకంగా మాట్లాడుతున్నారని మృతురాలి సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి గన్నవరం పోలీసులకు కంప్లైట్ చేసారు.
తన కుమార్తె మృతిని పవన్ కల్యాణ్ రాజకీయంగా వాడుకున్నారనీ, ఆయనపై చీటింగ్ కేసుతో పాటు నమ్మకద్రోహం కేసు కూడా పెట్టాలని ఆమె డిమాండ్ చేసారు. తమ కుమార్తె మరణంపై పవన్ కల్యాణ్ రోజుకో రకంగా మాట్లాడుతున్నారనీ, ప్రీతిని మానభంగం చేసి చంపేసారని ఒకసారి, ఎలాంటి ఆధారాలు లేకుండా చేసారని ఆమె విమర్శించారు. తమ కుమార్తె కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని మేము ఎప్పుడు డిమాండ్ చేస్తే, పవన్ కల్యాణ్ మీడియాలో మాట్లాడుతారని చెప్పారు. తమకు నమ్మకద్రహం, ఆదివాసీ బిడ్డపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆమె పోలీసులకు ఇచ్చిన కంప్లైంటులో ఆమె పేర్కొంది.
