1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Suspend the Assistant who came to the Secretariat wearing night pants: Bapatla District Collector

సచివాలయానికి నైట్ ప్యాంటు వేసుకొచ్చిన అసిస్టెంటును సస్పెండ్ చేయండి: బాపట్ల జిల్లా కలెక్టర్

Bapatla District Collector
రానురాను ఉద్యోగాలంటే, ఆ ఉద్యోగాన్ని ఎలా నిర్వర్తించాలన్నది తేలిక భావనగా మారిపోతోంది. కార్యాలయాలకు నైట్ ప్యాంటులు, షార్టులు వేసుకుని వచ్చేస్తున్నారు. ఇట్లాగే బాపట్లలోని స్థానిక 5వ వార్డు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ కూడా నైట్ ప్యాంటుతో ఆఫీసుకి వచ్చేసాడు. అదేసమయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఉద్యోగుల పనితీరు గురించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
 
ఆ సమయంలో డిజిటల్ అసిస్టెంట్ నైట్ ప్యాంటు వేసుకుని విధులకు హాజరు కావడాన్ని గుర్తించిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వెంటనే అతడిని సస్పెండ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. గడువు తీరినా ఇంకా 11 అర్జీలను పెండింగులో ఎందుకు పెట్టారంటూ అసహనం వ్యక్తం చేసారు. ఎప్పటి ఫైళ్లు అప్పుడే ఎందుకు క్లియర్ చేయడం లేదంటూ నిలదీశారు.
 
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
హర్మూజ్ జలసంధిలో భారత నౌకలపై కాల్పులు - ఢిల్లీలో ఇరాన్ రాయబారికి సమన్లు