1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. tdp leader b tech ravi exposes ys family history of murders and defeats

జగన్‌.. గత చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది... బీటెక్ రవి వార్నింగ్

btech ravi
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి టీడీపీ నేత బీటెక్ రవి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జగన్.. గత చరిత్ర తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది అంటూ హితవు పలికారు. మాకు తెలిసిన జగన్ వేరు.. ప్రజలకు తెలిసిన జగన్ వేరు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ పుట్టుపూర్వోత్తరాలను ఏకరవు పెట్టారు. 
 
ఆయన ఆదివారం మంగళగిరిన పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకురలతో మాట్లాడుతూ, వైఎస్‌.రాజారెడ్డి సతీమణి జయమ్మ 1968లో పులివెందుల పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్‌గా పోటీ చేసి కృష్ణమూర్తి చేతిలో ఓడి పోయారని, ఓటమి చరిత్ర వైఎస్‌ కుటుంబంలో ఆనాడే మొదలైందన్నారు. 
 
'1962లోనే పులివెందుల పీఎస్‌లో రాజారెడ్డి పేరుతో రౌడీ షీట్‌ ఉంది. నమ్మి పెట్టుబడి పెట్టిన వెంకటనరసయ్యను దారుణంగా హత్య చేసిన చరిత్ర వారిది. పెట్టుబడి లేకుండా వ్యాపారం చేసుకోవాలని సహకరించిన వ్యక్తినే చంపేస్తారా? మంగంపేట బైరైటీస్‌ సొంతం చేసుకున... వచ్చిన ఆదాయంతో రాజకీయాల్లోకి ప్రవేశించారు. త్రివేణి స్టీల్స్‌ పెట్టి ఎదుగుతున్న వ్యక్తిని కూడా హత్య చేయించిన చరిత్ర వీళ్లది. 
 
లింగాల మండలంలో రాజారెడ్డి కుటుంబం భయానక వాతావరణం సృష్టించింది. సింగిల్‌ విండో ప్రెసిడెంట్‌ రఘురామిరెడ్డిని దారుణంగా హత్య చేశారు. వాళ్లు చెప్పినట్టు వినకుండా స్వతంత్రంగా పోటీ చేశారని రఘురామిరెడ్డిని చంపేశారు. విధిలేని పరిస్థితుల్లోనే రాజారెడ్డి హత్య జరిగింది. వాళ్ల జోలికి వస్తే ఎవరినైనా దారుణంగా చంపేస్తారు. మద్దెలచెరువు సూరితో మీకు స్నేహ సంబంధాలు లేవా? జైలులో ఉండి ప్లాన్‌ చేసి పరిటాల రవిని హత్య చేయిస్తారా?
 
మొదట బళ్లారిలో ఆర్కేని చంపేశారు. రవి అనుచరుడు అనంతపురంలో తగరకుంట ప్రభాకర్‌రెడ్డిని హత్య చేశారు. ఆర్కే, ప్రభాకర్‌ రెడ్డిని చంపాక పరిటాల రవిని చంపేశారు. టీడీపీని విడిచిపెట్టి రాలేదని రవిని పొట్టనపెట్టుకున్నారు. పులివెందులలో విలేకరి నారాయణను దారుణంగా హత్య చేశారు. ప్రజాదరణ కలిగిన నాయకులను బతకనిచ్చేవారు కాదు. 
 
అధికారాన్ని దుర్వినియోగం ఎలా చేయాలో.. మీఘనత ఏంటో అందరికీ తెలుసు. ఇష్టమొచ్చినట్టు హత్యలు చేయించి పబ్బం గడుపుకొన్న పరిస్థితులు వాళ్లవి. ఇవాళేదో నీతులు చెబుతుంటే నవ్వొస్తోంది. జగన్‌.. గత చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. మాకు తెలిసిన జగన్‌ వేరు.. ప్రజలకు తెలిసిన జగన్‌ వేరు’’ అని బీటెక్‌ రవి అన్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
హర్మోజ్‌ను తెరుస్తాం.. ఆంక్షలు ఎత్తివేయండి : ఇరాన్ సరికొత్త ప్రతిపాదన