సంబంధిత వార్తలు
- పోలీస్ అడిగాడని లిఫ్ట్ ఇస్తే రూ.20 వేలు కాజేశాడు...
- రౌడీషీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం
- ఒంటరి మహిళపై అత్యాచారం - సీఐ పరారీ... ఆచూకీ కనిపెట్టని పోలీసులు
- కోవైలో పదేళ్ల బాలిక చనిపోతే.. ప్రెస్మీట్లో నవ్వుతూ బదులిస్తారా? విజయ్ సీరియస్ (video)
- విజయవాడ ఆయుర్వేద కాలేజీలో లైంగిక వేధింపులు... నలుగురిపై వేటు
భర్తపై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళ్తే .. ఎస్ఐ నమ్మించి రెండో పెళ్లి చేసుకున్నాడు..
ఓ మహిళ ఎస్ఐ పై పోలీసులకు ఫిర్యాద చేసింది. భర్తతో విభేదాలు రావడంతో అతనిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ఓ ఎస్ఐ నమ్మించి ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత మరో స్టేషన్‌కు బదిలీ అయ్యాక అక్కడ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో బాధిత మహిళ ఒంగోలు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు నిందితుడి అక్రమ వసూళ్ల వివరాలను, సెటిల్‌మెంట్లకు వాడిన సెల్‌ఫోన్ నంబర్లను, తనతో కలిసి ఉన్నప్పటి ఫొటోలు, వీడియోలను ఎస్పీకి బుధవారం అందించారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఒంగోలుకు చెందిన ఓ మహిళ ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదు పత్రంలో... 'నాకు 2004లో వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. భర్తతో గొడవలు తలెత్తడంతో ఒంగోలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశా. అప్పటి ఎస్ఐ రాములు నాయక్ తరచూ ఫోన్ చేసి నాతో మాట్లాడేవారు. వాట్సప్ మెసేజ్‌లు పెట్టేవారు. అప్పటికే ఆయనకు పెళ్లయింది. అయినా నన్ను పెళ్లి చేసుకుంటానని, పిల్లలను బాగా చూసుకుంటానని నమ్మించారు.
అతని మాటలు నమ్మాను. ఆ తర్వాత శ్రీశైలంకు తీసుకెళ్లి అక్కడి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. 14 ఏళ్లు కాపురం చేశారు. తెనాలికి సీఐగా వచ్చాక మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. నాటి నుంచి నన్ను వేధిస్తున్నారు. నాకు రూ.30 లక్షలిచ్చి, సెటిల్‌మెంట్ చేసుకోవాలంటూ ఓ అగ్రిమెంట్‌ను తన ప్రైవేట్ డ్రైవర్‌తో పంపించి సంతకం పెట్టాలన్నారు. ఆ డబ్బును తిరిగిచ్చేయడానికి నేను తెనాలి వెళ్తే ఆ మహిళతో దాడి చేయించారు. నన్ను అడ్డు తొలగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు' అని చెప్పారు. మహిళ ఫిర్యాదుతో ప్రస్తుతం సీఐగా రాములు నాయక్‌ను సస్పెండ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
