1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. The Simhachalam Executive Officer suspects that a snail was deliberately placed in the tamarind rice to spread false propaganda

పులిహోరలో నత్తను పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారనే అనుమానం: సింహాచలం ఈవో

Simhachalam EO on prasadam
సింహాచలం పులిహోర ప్రసాదంలో నత్త కనబడిందంటూ ఇద్దరు భక్తులు వీడియో వైరల్ చేయడంపై ఆలయ ఈవో స్పందించారు. పులిహోరలో ఎట్టి పరిస్థితుల్లో నత్త వచ్చే పరిస్థితి లేదని అన్నారు. గత మూడు దశాబ్దాలుగా ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదన్న ఆయన పులిహోరలో కావాలనే నత్తను కలిపి దాన్ని వీడియో తీసి వైరల్ చేస్తున్నట్లు తమకు అనుమానం వుందని అన్నారు. అందుకే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలియజేసారు.
 
సింహాచలం ప్రసాదంలో నత్త కనబడిందంటూ భక్తులు ఆరోపణ
సింహాచలం అప్పన్నను దర్శించుకుని స్వామివారి ప్రసాదం తీసుకుని తినబోతుండగా అందులో నత్త కనిపించిందని భక్తులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. స్వామివారి ప్రసాదం పులిహోర తింటుండగా పొట్లం లోపల నుంచి నత్త బైటకు వచ్చిందని, దాంతో దాన్ని తీసుకుని కౌంటర్ వద్దకు వెళ్లి ప్రశ్నిస్తే వారి నుంచి సరైన స్పందన రాలేదని ఆరోపించారు. పైగా తమ వద్ద వున్న ప్యాకెట్ తీసుకుని వేరే ప్యాకెట్ చేతిలో పెట్టి పొమ్మన్నారనీ, తాము ఆ ప్యాకెట్ కూడా వెనక్కి ఇచ్చేసి వచ్చామని చెప్పారు. కనుక ఫ్రెండ్స్... సింహాచలం ప్రసాదం తినేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించి తినాలని చెప్పారు. వారు పోస్ట్ చేసిన వీడియోను స్నేహితులకు కూడా షేర్ చేయాలంటూ చెప్పారు.
 
తర్వాతి కథనం
సొరంగంలో ఢీకొన్న లోకోమోటివ్ రైళ్లు - 60 మందికి గాయాలు