ఆదివారం, 15 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 9 ఫిబ్రవరి 2026 (22:57 IST)

హెలిప్యాడ్ కోసం జగన్ ఇంటి పక్కనే వున్న వ్యక్తి స్థలాన్ని లాక్కున్నారు: సీఎం చంద్రబాబు

chandrababu naidu
హెలిప్యాడ్ కోసం మాజీ సీఎం జగన్ ఇంటి పక్కనే వున్న వ్యక్తి స్థలాన్ని బలవంతంగా లాక్కున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రైవేట్ వ్యక్తి దగ్గర కొనుక్కున్న భూమిని ఇవ్వమంటే ఇవ్వనన్నారని బెదిరించారు. అయినా ఇవ్వకపోయేసరికి 22-Aలో పెట్టేసారు. చట్టాలు చేయాల్సిన ముఖ్యమంత్రి, చట్టాలు అమలు చేయాల్సిన ముఖ్యమంత్రే అక్రమంగా 22-ఎలో పెట్టి లాక్కుంటే దీన్ని ఏమంటారు. ఇది పరాకాష్ట కాదా అంటూ ప్రశ్నించారు చంద్రబాబు.
 
భూమిని బలవంతంగా లాక్కుంటే ఇంతకాలం ఏం చేసావని బాధిత వ్యక్తిని అడిగితే... మౌనంగా వున్నానని చెప్పారు. ఎందుకని అడిగితే.. కనీసం బ్రతికి వుంటే ఎప్పటికైనా పోరాడి తెచ్చుకోవచ్చని అన్నారు. ఆ భూమికి సంబంధించి అన్ని పత్రాలు మాకు ఇచ్చి వెళ్లారు అంటూ వెల్లడించారు చంద్రబాబు. దీనికి సంబంధించి అన్నింటిని పరిశీలిస్తున్నామని చెప్పారు.