శుక్రవారం, 6 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 11 ఫిబ్రవరి 2026 (13:10 IST)

మీ కుటుంబ సభ్యులకు ప్రాణహాని తప్పదంటూ నలుగురు ఏపీ మంత్రులకు బెదిరింపు లేఖలు

Kandula Durgesh
ఏపీ పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కందుల దుర్గేష్‌కి మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖ వచ్చింది. మరో ముగ్గురు మంత్రులు కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్‌లకు కూడా ఇదే తరహా బెదిరింపు లేఖలు వచ్చాయి. పర్యాటక శాఖామంత్రి తనకు వచ్చిన బెదిరింపు లేఖపై తుళ్లూరు పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసారు.
 
నలుగురు మంత్రులను హెచ్చరిస్తూ వచ్చిన లేఖలు నిజంగా మావోయిస్టుల నుంచి వచ్చాయా లేక ఎవరైనా ఆకతాయిలు చేసిన పనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ లేఖలు ఎక్కడ నుంచి పోస్ట్ చేయబడినవో తనిఖీ చేస్తున్నారు. దాన్నిబట్టి లేఖలు రాసినవారు ఎవరన్నది పోలీసులు తేల్చేందుకు యత్నం చేస్తున్నారు.