సంబంధిత వార్తలు
- Hyderabad: ఆర్మీ ఆఫీసర్ అని మోసం.. డబ్బు గుంజేసిన హైదరాబాద్ వ్యక్తి అరెస్ట్
- బ్రిటీష్ మహిళ మెదడులో పరాన్నజీవులు - పదేళ్ళపాటు జీవితం నరకప్రాయం
- గోవాలో తెలంగాణ వ్యక్తి అరెస్ట్.. మహిళను స్కూటర్‌పై కూర్చోబెట్టుకుని?
- పెళ్లి చేసుకుంటానని మైనర్ బాలికపై అత్యాచారం.. ఎక్కడ?
- పెళ్లి ఊరేగింపుపై సాయుధ దుండగుల దాడి.. వధువు బంగాలు నగలు లూటీ
ప్రేయసికి నిశ్చితార్థం.. వివాహిత ప్రియుడి బెదిరింపులు.. పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య
Vijayanagaram Woman
తోండ్రంగి గ్రామానికి చెందిన అఖిల (22) డిగ్రీ పూర్తి చేసి విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ, అనారోగ్యంతో ఉన్న తండ్రి, తల్లి, చెల్లికి ఆసరాగా నిలిచింది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన వివాహితుడు, ఇద్దరు పిల్లల తండ్రి అయిన రామునాయుడు అనే వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇటీవల అఖిలకు వేరొక వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిర్చారు ఆమె కుటుంబీకులు.
జూలై 2న (గురువారం) నిశ్చితార్థానికి ముహూర్తం ఖరారు చేశారు. అంతే ఈ విషయం తెలుసుకున్న రామునాయుడు అఖిలను వేధించాడు. పురుగుల మందు ఇచ్చి చావమన్నాడు. అలా చేయకపోతే.. పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి మన విషయం చెప్పి సంబంధం చెడగొడతానని బెదిరించాడు.
దీంతో అఖిల జూన్ 30న పురుగుమందు తాగింది. ఆపై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు మరణానికి ముందు యువతి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. మృతురాలి తండ్రి రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు గరివిడి ఎస్సై లోకేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
