1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Visakhapatnam and Vijayawada feature among India-s fastest-growing career hubs in LinkedIn-s Cities on the Rise 2026

సిటీస్ ఆన్ ది రైజ్ 2026: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కెరీర్ హబ్‌లలో విశాఖపట్నం, విజయవాడ

Visakhapatnam and Vijayawada feature among India-s fastest-growing career hubs
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్‌వర్క్ అయిన లింక్డ్ఇన్, తమ సిటీస్ ఆన్ ది రైజ్ జాబితా యొక్క రెండవ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఉపాధి కల్పనలో అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధిస్తున్న 10 మెట్రోయేతర భారతీయ నగరాలను ఈ జాబితా వెల్లడించింది. ఈ సంవత్సరం విశాఖపట్నం జాతీయ స్థాయిలో తమ అగ్రస్థానాన్ని నిలుపుకోగా, విజయవాడ కూడా భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కెరీర్ హబ్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ జాబితాలో లూథియానా (2), సూరత్ (3), వదోదర (4), ప్రయాగ్‌రాజ్(5) మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. ఇది భారతదేశంలోని సాంప్రదాయ మెట్రో హబ్‌లకు మించి ప్రతిభ, పెట్టుబడుల యొక్క విస్తృత మార్పును వెల్లడిస్తుంది.
 

ఐటీ సేవల హబ్‌లుగా విశాఖ, విజయవాడ

ఉద్యోగార్థులకు అత్యంత సవాలుతో కూడిన సమయంలో ఈ జాబితా వచ్చింది. లింక్డ్‌ఇన్ పరిశోధన వెల్లడించే దాని ప్రకారం, భారతదేశంలోని 72% మంది నిపుణులు ఈ సంవత్సరం చురుకుగా కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నారు. అయితే, పెరిగిన పోటీ, ఏఐకి సంబంధించిన నైపుణ్యాల అంతరాలు పెరగడంతో ఉద్యోగ అన్వేషణ మరింత కష్టంగా మారిందని 76% మంది చెబుతున్నారు. విశాఖపట్నం, విజయవాడ రెండింటిలోనూ ఐటీ సేవలు, ఐటీ కన్సల్టింగ్ అగ్రగామి నియామక పరిశ్రమగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఆర్థిక వ్యవస్థలో ఎంత లోతుగా ఈ రంగం పెనవేసుకుపోయిందో ఇది సూచిస్తోంది. రసాయన తయారీ, రుణ మధ్యవర్తిత్వం వంటి రంగాలలో కూడా ఉపాధి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. 
 
లింక్డ్ఇన్ కెరీర్ నిపుణురాలు, ఇండియా సీనియర్ మేనేజింగ్ ఎడిటర్ అయిన నిరాజిత బెనర్జీ మాట్లాడుతూ, ఈ ఏడాది జాబితా భారతదేశ వృద్ధి కథ మరింతగా ఎలా విస్తరిస్తుందో చూపిస్తుంది. అభివృద్ధి చెందుతున్న నగరాలు తమకంటూ ప్రత్యేకమైన, బహుళ రంగాలతో కూడిన ఉద్యోగ అవకాశాల మార్కెట్‌లను సొంతంగా నిర్మించుకుంటున్నాయి. ఈ నగరాల్లోని సాంప్రదాయ పరిశ్రమలకు తోడుగా సాంకేతికత, ఆర్థిక సేవలు, మౌలిక సదుపాయాలు మరియు సేవా రంగాలు కూడా వచ్చి చేరుతున్నాయి.
 
ఉద్యోగార్థులకు, కెరీర్ ప్రణాళికలో నివాస ప్రాంతం మరింత చురుకైన భాగంగా మారాలని దీని అర్థం. యజమానులు ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నారో, ఏ రంగాలు పుంజుకుంటున్నాయో, మీ నైపుణ్యాలు వివిధ రంగాలకు ఎంతవరకు ఉపయోగపడతాయో పరిశీలించండి. మీ అన్వేషణను మెట్రో నగరాలకు మించి వాటికి అనుబంధ రంగాలలోకి విస్తరించడం ద్వారా, చాలామంది నిపుణులు ఊహించిన దానికంటే వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో విశ్వసనీయమైన కెరీర్ మార్గాలను కనుగొనవచ్చు అని అన్నారు. 
 

సాంప్రదాయ పరిశ్రమలకు అతీతంగా విస్తృత ఆర్థిక వ్యవస్థలు

ఈ సంవత్సరం జాబితా పరిశీలిస్తే, ఈ ఏడాది జాబితాలోని నగరాలు తమకున్న బలాలను మరింత పటిష్టం చేసుకోవడం, వృద్ధికి కొత్త మార్గాలను ఆకర్షించడం ద్వారా తమ ఆర్థిక పునాదిని విస్తరిస్తున్నాయి. విశాఖపట్నం తమ ఓడరేవు, ఫార్మా, తయారీ రంగ ఆర్థిక వ్యవస్థలను భారీ ఏఐ, డేటా సెంటర్, సాంకేతిక రంగ పెట్టుబడులతో అనుసంధానిస్తుండగా, లుధియానా తన తయారీ రంగానికి ఉక్కు, విమానయానం, ఆతిథ్య రంగాలను జోడిస్తోంది.
 
స్టార్టప్‌లు, ఎగుమతులు, రియల్ ఎస్టేట్ ద్వారా వస్త్రాలు, వజ్రాలకు అతీతంగా సూరత్ విస్తరిస్తుండగా, రసాయనాలు, యంత్రాలతో పాటు టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఎంటర్‌ప్రైజ్ పెట్టుబడులను వదోదర ఆకర్షిస్తోంది. విజయవాడ కూడా ఇదే మార్గాన్ని అనుసరిస్తోంది. ఐటీ, ఇ-గవర్నెన్స్ కంపెనీల నుండి పెరుగుతున్న ఆసక్తి దాని వాణిజ్య ఆర్థిక వ్యవస్థకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
 

మౌలిక సదుపాయాల పెట్టుబడులు స్థానిక వృద్ధితో కొత్త ఉద్యోగాలు

నగరాలు తమ ఆర్థిక పునాదిని విస్తరిస్తున్న కొద్దీ, మౌలిక సదుపాయాలు ఆతిథ్యం, టెక్నాలజీ, తయారీ, వాణిజ్య సేవల రంగాలలో డిమాండ్‌ను సృష్టిస్తున్నాయి. ప్రయాగ్‌రాజ్ మెట్రో నెట్‌వర్క్, గంగా ఎక్స్‌ప్రెస్‌వే, విస్తరించిన పర్యాటక సామర్థ్యం వంటివి ఆతిథ్యం, సేవల రంగాలలో ఏడాది పొడవునా అవకాశాలను కల్పిస్తున్నాయి.
 
రాజ్‌కోట్ యొక్క అంతర్జాతీయ విమానాశ్రయం, మెడికల్ డివైస్ పార్క్ పారిశ్రామిక, ఎగుమతి ఆధారిత ఉపాధిని బలోపేతం చేస్తుండగా, జబల్‌పూర్ రోడ్ల ఆధునీకరణ, జీసీసీలపై దృష్టి సారించడం టెక్నాలజీ, వాణిజ్య రంగ ఉద్యోగాలను ఆకర్షిస్తున్నాయి. విజయవాడలో, హైదరాబాద్‌కు మెరుగైన కనెక్టివిటీ, అమరావతి చుట్టూ జరుగుతున్న కొత్త అభివృద్ధి ఐటీ, రియల్ ఎస్టేట్, వ్యాపార సేవల రంగాలలో అవకాశాలను విస్తృతం చేస్తున్నాయి. అదే సమయంలో, రాంచీలోని స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, ప్రధాన పారిశ్రామిక పెట్టుబడులు, దాని సాంప్రదాయ మైనింగ్ ఆర్థిక వ్యవస్థకు అతీతంగా ఉద్యోగాలకు మద్దతు ఇస్తున్నాయి.
 

జాతీయ బ్యాంకులు, పారిశ్రామిక సముదాయాలు, విద్యా సంస్థలు

'రైజ్'గా పేర్కొన్న 10 నగరాలలోనూ ఐటీ సేవలు, టెక్నాలజీ కన్సల్టింగ్ అగ్రగామి మూడు నియామక పరిశ్రమలలో ఉండగా, ఎనిమిది నగరాలలో బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగం ఉంది. ప్రతి నగరం తన ప్రత్యేక స్థానిక బలాబలాలను పెంపొందించుకుంటున్నప్పటికీ, మెట్రో నగరాలకు అతీతంగా జాతీయ స్థాయికి సంబంధించిన వృత్తిపరమైన ఉద్యోగాలు మరింత విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయని కూడా ఇది చూపిస్తుంది.
 
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, లార్సెన్- టూబ్రో, రిలయన్స్ గ్రూప్ సంస్థలు, హెచ్‌సీఎల్‌టెక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కాన్‌సెంట్రిక్స్ వంటి ఉద్యోగ కల్పన సంస్థలు ఈ స్థానిక ఉద్యోగ మార్కెట్లకు విస్తృతిని చేకూరుస్తుండగా, ప్రముఖ విశ్వవిద్యాలయాలైన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ, ఐఐటీ (ఐఎస్ఎం) ధన్‌బాద్ ఉద్యోగాలను, ప్రతిభావంతుల సరఫరాను రెండింటినీ బలోపేతం చేస్తున్నాయి.
 

భారతదేశం 2026లో వృద్ధి చెందుతున్న లింక్డ్‌ఇన్ నగరాల జాబితా

1. విశాఖపట్నం

2. లూథియానా
3. సూరత్
4. వడోదర
5. ప్రయాగ్‌రాజ్ 
6. రాజ్‌కోట్
7. జబల్పూర్
8. రాంచీ
9. రాయ్ పూర్ 

10. విజయవాడ

About Writer
డా|| యిమ్మడిశెట్టి వెంకటేశ్వర రావు
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
కుమారుడుని తప్పించబోయి ఇరుక్కున్న మాజీ మంత్రి సీదిరి అరెస్టు?