1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Visakhapatnam: Friends Invite Woman to Party and murdered

విశాఖలో ఘోరం, పార్టీకి పిలిచి స్నేహితురాలిని చంపేసిన ఫ్రెండ్స్, రాత్రి ఆ హోటల్లో ఏం జరిగింది?

Young woman
విశాఖపట్టణంలో దారుణ ఘటన జరిగింది. పార్టీ చేసుకుందాము రమ్మంటూ పిలిచిన స్నేహితులే ఆమె పాలిట మృత్యువు అయ్యారు. మొత్తం నలుగురు యువకులు, ఒక యువతి కలిసి శాంతికుమారిని పార్టీకి ఆహ్వానించారు. రాత్రి 9 గంటలకు ప్రముఖ హోటలుకి వెళ్లిన శాంతి కుమారి అనే యువతి తెల్లారేసరికి శవమై కనబడింది.
 
తొలుత ఆ యువతికి ఫిట్స్ వచ్చాయనీ, అందువల్ల చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేసారు. ఐతే ఏదో జరగరానిది జరిగిందనీ, దాంతో స్నేహితులందరూ కలిసి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. నిందితుల్లో నలుగురు యువకులు, ఓ యువతి వున్నారు. వీరిలో ఓ యువకుడు పరారీలో వున్నాడు. కాగా యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రిపోర్ట్ వచ్చాక మరింత స్పష్టత రానుంది.
About Writer
ఐవీఆర్