1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Vizag Radha Gayathri Case Takes a New Turn Investigation ...

టెక్కీ రాధా గాయత్రి మృతి కేసులో వీడని మిస్టరీ : భర్త శ్రీచరణ్‌కు మరో వ్యక్తి సాయం?

Techie Radha Gayatri dies in Mussoorie
విశాఖపట్టణంకు చెందిన టెక్కీ రాధా గాయత్రి మృతి కేసులోని మిస్టరీ ఇంకా తేలలేదు. తన కుమార్తెను అల్లుడు శ్రీచరణ్ హత్య చేశారంటూ మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పైగా, ఈ హత్య చేసేందుకు శ్రీచరణ్‌కు మరోవ్యక్తి సాయం చేసివుంటారని వారు అనుమానం వ్యక్తం చేశారు. తమ కుమార్తెను ముమ్మాటికీ పథకం ప్రకారమే అడ్డుతొలగించుకున్నారన్నారు. 
 
అక్కడి ప్రభుత్వం ఈ కేసుపై మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో సుధాకర్‌, సత్యవతి మీడియాతో మాట్లాడారు. ఘటన జరిగిన రోజు (జూన్‌ 14) రాత్రి 11 గంటలకు ఈ ప్రాంతానికి రావడానికి శ్రీచరణ్‌కు ఖచ్చితంగా మరో వ్యక్తి సహకరించాడని సుధాకర్ ఆరోపించారు. సత్యవతి మాట్లాడుతూ ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం, మసూరీ పోలీసులపై తమకు నమ్మకముందన్నారు.
 
టెక్కీ రాధాగాయత్రి అనుమానాస్పద మృతి కేసుపై మెజిస్టీరియల్‌ విచారణకు డెహ్రాడూన్ జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ చౌహాన్‌ ఆదేశించారు. మసూరీ సీనియర్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ రాహుల్‌ ఆనంద్‌ మంగళవారం కేసు విచారణ ప్రారంభించినట్లు సమాచారం. రాధాగాయత్రి పోస్టుమార్టం నివేదికపై మెజిస్టీరియల్‌ విచారణకు జోక్యం చేసుకోవాలంటూ సైనిక్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ లెఫ్టినెంట్‌ కర్నల్‌ వీరేంద్ర ప్రసాద్‌ భట్‌ను ఈ నెల 4న ఆమె తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి కోరిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జూన్‌ 14వ తేదీ అర్ధరాత్రి నుంచి 16 వరకు జరిగిన ఘటనలపై డివిజినల్‌ మేజిస్ట్రేట్‌ విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
OPPO నుంచి కొత్త AI పోర్ట్రెయిట్ కెమెరా, AI రీమిక్స్ కొలేజ్ ఫీచర్లతో కొత్త Reno 16 సిరీస్‌ అదుర్స్