సంబంధిత వార్తలు
- అమరావతిలో క్వాంటం ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- నారీ శక్తి వందన్‌కు మద్దతు ఇవ్వండి : టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు లేఖ
- వైకాపాలో జగన్ మాత్రమే కాదు.. చాలా మంది సైకోలు ఉన్నారు : చంద్రబాబు
- కూటమి పార్టీలకు దత్తపుత్రికగా మారిన షర్మిలకు జగన్ గురించి మాట్లాడే అర్హత వుందా?
- పాదయాత్ర చేస్తా, మావిగన్ గురించి ప్రజలకు వివరిస్తా: జగన్ ప్రకటన
చరిత్ర సృష్టించాం... డేటా సెక్యూరిటీ నిపుణులుగా మారుస్తా : సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ, గన్నవరం మేధాటవర్స్‌లో ఏర్పాటు చేసిన క్వాంటం టెస్ట్ బెడ్స్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని 45 లక్షల మందిని ఏఐ, క్వాంటం, వైజర్ డేటా సెక్యూరిటీలో నిపుణులుగా మారుస్తామని వెల్లడించారు. సాంకేతికతను అనుసరించడమే కాకుండా దానిని ఆవిష్కరించే స్థాయికి ఏపీ ఎదిగేలా ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. ప్రతి పౌరుడికి ఏఐ లాంటి సాంకేతికతను అందుబాటులోకి తీసుకు రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
డిసెంబరు నుంచి అమరావతిలో క్వాంటం వ్యాలీ కూడా ప్రారంభమవుతుందని తెలిపారు. వన్ ఫ్యామిలీ వన్ ఆంత్రప్రెన్యూర్‌తో పాటు ప్రతీ వెయ్యి మందికి ఒక స్టార్టప్‌ను తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. ఆర్టీఐహెచ్ ద్వారా స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహిస్తున్నామని చంద్రబాబు వివరించారు. ఐఐటీ చెన్నై, ఐబీఎం సంస్థల భాగస్వామ్యంతో లక్షలాది మందిని క్వాంటం రంగంలో నిపుణులుగా తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు.
కొత్త సంస్థలు, నైపుణ్యం, క్వాంటం మౌలిక సదుపాయాలతో భవిష్యత్తును నిర్మిస్తున్నామని అన్నారు. ఔషధాల ఆవిష్కరణ, వ్యవసాయ ఉత్పాదకత, రక్షణ పరిశోధన, లాజిస్టిక్స్ లాంటి రంగాల్లో వినూత్న ఆవిష్కరణలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. డిజిటల్ లావాదేవీలు మరింత సురక్షితంగా మారే అవకాశం ఉందన్నారు. క్లైమేట్ మోడలింగ్ లాంటి అంశాలను చేపట్టవచ్చని అభిప్రాయపడ్డారు. క్రయోజనిక్స్, ఫ్యాబ్రికేషన్, యాంప్లిఫైడ్ రీసెర్చ్‌లలో విస్తృతంగా ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
