సంబంధిత వార్తలు
- ప్రశ్న రావణ్‌కు చుక్కలు చూపిన జనసేన నేతలు - పోలీస్ వాహనంపై కోడిగుడ్లతో దాడి
- యూట్యూబర్ రావణ్‌కు చుక్కలు చూపిస్తున్న ఏపీ పోలీసులు.. మరో కేసు నమోదు
- రాజమహేంద్రవరంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం
- కాకినాడలో తమిళనాడు సీఎం విజయ్ పర్యటన.. హోర్డింగ్‌లు అదుర్స్ (video)
- అడగ్గానే ఫ్రిజ్‌లో నీళ్లు ఇవ్వలేదని అమ్మను చంపేశాడు...
కాకినాడ చిన్నారి జానుని అప్పగిస్తే కేసు లేకుండా చూస్తాం: పోలీసులు ప్రకటన
కాకినాడ పామాయిల్ తోటలో కాపలాగా వుండే కుటుంబానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి(జాను)ని ఎవరైనా కిడ్నాప్ చేసి వుంటే తమకు అప్పగించాలని, వారి మీద ఎట్లాంటి పోలీసు కేసు నమోదు చేయబోమని పోలీసులు ప్రకటించారు. ఎందుకంటే కేసులు పెట్టడం కంటే ఆ చిన్నారిని వారి తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా చేర్చడమే తమ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు.
అందువల్ల చిన్నారి ఆచూకి తెలిసినవారు ఎవరైనా వుంటే వివరాలను తమకు తెలియజెప్పాలనీ, అలా ఆచూకి చెప్పిన వారికి లక్ష రూపాయలు నజరానా అంటూ ప్రకటన కూడా చేసారు.
ఇప్పటివరకూ చిన్నారి ఆచూకి తెలియలేదనీ, తమ అనుమానం ప్రకారం ఫోను వాడని వారే పాపను కిడ్నాప్ చేసి వుంటారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
