1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Weather Report, Warning to the people of Andhra, heavy rains in those districts for two days, be careful

ఆంధ్ర ప్రజలకు హెచ్చరిక, ఆ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలు, జాగ్రత్త

weather alert
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలెర్ట్ ఇచ్చింది. అదేమిటంటే... మరో 48 గంటల్లో కేరళ రాష్ట్రాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నట్లు తెలియజేసింది. వీటి ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 9 జిల్లాలపై వుంటుందని వెల్లడించింది. విశాఖపట్టణం, అనకాపల్లి, ఏలూరు, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసారు.
 
దక్షిణ కోస్తాలో ఈదురుగాలులు తీవ్రంగా విస్తాయని, ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచన చేసారు. వర్షం కురిసే సమయంలో పిడుగులు పడవచ్చు కనుక పక్కా ఇళ్లలో తలదాచుకోవాలనీ, చెట్ల కింద- మైదానం వంటి ప్రాంతాల్లో వుండరాదని అధికారులు సూచిస్తున్నారు.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
జనసేన తెలంగాణ ఇండోర్ సమావేశంపై ఎందుకు అంత జంకు?