సోమవారం, 16 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 19 ఫిబ్రవరి 2026 (13:34 IST)

కూతురుని కాపాడంటూ తిరుపతిలో మహిళ ఆక్రందన, AP Govt Fact Checkలో తేలిందేమిటంటే?

Fact check on woman allegations
ఇటీవలే ఓ మహిళ తన కుమార్తెకు కొందరు డ్రగ్స్ ఇచ్చి వ్యభిచార కూపంలోకి దించారంటూ చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తన కుమార్తెను కాపాడంటూ సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వేడుకుంటున్నట్లు ఆమె అందులో మాట్లాడారు. దీని గురించి ఓ పత్రిక పతాక శీర్షికల్లో వార్తలు ప్రచురించింది. ఈ క్రమంలో AP Govt Fact Check విభాగం ఆ మహిళ కుమార్తె గురించి పూర్తి వివరాలను సేకరించగా బైటపడిన వాస్తవాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
 
ఫ్యాక్ట్ చెక్ విభాగం పేర్కొంటూ...నా కూతురిని కాపాడండి అనే శీర్షికతో ఒక దినపత్రిక ప్రచురించిన వార్తలో ఎలాంటి వాస్తవం లేదు. రేణిగుంటకు చెందిన ఒక మహిళ తన కుమార్తెను ఎవరో వ్యభిచార కూపంలో దించినట్లు, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోనట్లు వార్త ప్రచురించారు. ఆమె చేసిన ఫిర్యాదుపై పోలీసులు కూలంకషంగా విచారణ జరిపారు. ఆ మహిళ కుమార్తెను కలిసి పోలీసులు మాట్లాడారు.
 
ఆ యువతి క్షేమంగా ఉన్నారు. తన తల్లితో విభేదాల కారణంగా రేణిగుంటలోనే ఒక సంస్ధలో ఉద్యోగం చేస్తూ హాస్టల్‌లో ఉండేవారు. ఆ మహిళ తరచూ వెళ్ళి గొడవ చేస్తుండటంతో ఆ యువతిని ఆ సంస్థ వారు ఉద్యోగం నుంచి తీసేశారు. దాంతో ఆ యువతి బెంగళూరు వెళ్లి ప్రస్తుతం ఒక పెద్ద సంస్థలో ఉద్యోగం చేసుకుంటున్నారు. తన తల్లికి మతి స్థిమితం లేదని ఆమె మాటలు పట్టించుకోవద్దని ఆ యువతి చెప్పారు. ఈ మేరకు ఆ యువతి స్పష్టమైన వాగ్మూలం కూడా ఇచ్చారు.