రంగారెడ్డిలో దారుణం : మహిళా హోంగార్డు దారుణ హత్య!
రంగా రెడ్డి జిల్లాలోని మేడ్చల్ మండలం బసిరేగాడిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా హోంగార్డును గుర్తుతెలియని దుండగులు బంగరాళ్లతో మోదీ హత్య చేశారు. ఆమెపై తొలుత అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమెను హత్య చేశారని భావిస్తున్నారు.
మృతురాలు హైదరాబాద్ రేంజ్ ఐజీ కింద హోంగార్డుగా పనిచేస్తున్న నవనీతగా(40)గా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలో లభించిన ఐడీ కార్డుతో మృతురాలి వివరాలు లభ్యమయ్యాయి. ఘటనా స్థలికి పోలీసులు క్యూస్‌టీం చేరుకుని ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
విషయం బయటపడుతుందనే భయంతో దుండగులు అత్యాచారం చేసిన తర్వాత ఆమెను హతమార్చినట్లు అనుమానిస్తున్నారు.