1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Woman Security Guard Attacked at Dwaraka Tirumala for Asking Someone to Wear a Chunni, Video

చున్నీ వేసుకోమన్నందుకు ద్వారకా తిరుమల మహిళా సెక్యూరిటీ గార్డుపై దాడి, వీడియో

Woman Security Guard at Dwaraka Tirumala
ఆలయంలో దైవదర్శనానికి వెళ్లేందుకు కొన్ని నిబంధనలు వుంటాయి. ఆ నిబంధనలను అనుసరిస్తూ దైవ దర్శనం చేసుకోవాల్సి వుంటుంది. ఐతే ఈ విషయంలో కొన్నిచోట్ల చిన్నపాటి ఘర్షణలు, మరికొన్నిచోట్ల దాడులు కూడా జరుగుతున్నాయి. తాజాగా ద్వారకా తిరుమల ఆలయ పరిధిలోనూ ఇదే జరిగింది. పంజాబీ డ్రెస్ వేసుకున్న ఓ యువతి చున్నీ వేసుకోకుండా దర్శనానికి వెళ్లేందుకు క్యూలో నిలబడింది.
 
ఇది గమనించిన మహిళా సెక్యూరిటీ గార్డు ఆ భక్తురాలిని చున్నీ వేసుకోవాల్సిందిగా సూచించింది. దీనితో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు యువతి.... చున్నీ వేసుకోనంత మాత్రాన నేనేమైనా నీకు అసభ్యంగా కనిపిస్తున్నానా అంటూ ఆమెపై వాగ్వాదానికి దిగింది. మాటామాటా పెరగడంతో యువతి కుటుంబ సభ్యులు మహిళా సెక్యూరిటీ గార్డుపై దాడి చేసారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తర్వాతి కథనం
పాదయాత్ర చేస్తా, మావిగన్ గురించి ప్రజలకు వివరిస్తా: జగన్ ప్రకటన