1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Work From Home For Govt Employees Also In Future : AP CM Chandrababu Naidu

తరుముకొస్తున్న సంక్షోభం - వర్క్ ఫ్రమ్ హోంపై సీఎం బాబు దృష్టి

chandrababu
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడింది. ముఖ్యంగా, ఈ ప్రభాదం భారత్‌పై మరింత ఎక్కవగా ఉంది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ పొదుపు చర్యలకు పిలుపునిచ్చారు. ఇపుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఈ పొదుపు మంత్రం పఠిస్తున్నారు. దేశాన్ని కాపాడేందుకు పొదుపు చర్యలను పాటిద్దామని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. 
 
ప్రధాని మోడీ పొదుపు పిలుపు చర్యలపై మంత్రివర్గం ప్రత్యేకంగా చర్చించింది. 'నా దేశం - నా బాధ్యత' పేరుతో పొదుపుపై ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కాన్వాయ్‌లు తగ్గించుకుంటే సరిపోదని.. ఇతర మార్గాలూ చూడాలన్నారు. జిల్లా పర్యటనల్లో ఖర్చులతో పాటు విదేశ పర్యటనలూ తగ్గించుకోవాలని సూచించారు. వర్చువల్‌ విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిద్దామన్నారు.
 
ప్రభుత్వ శాఖలన్నీ పొదుపు చర్యలపై దృష్టిసారించాలని.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీలను 24 - 26 మధ్య నడపాలని సీఎం ఆదేశించారు. వర్క్‌ఫ్రమ్‌ హోంపై స్టడీ చేసి కార్యాచరణ రూపొందించాలన్నారు. సౌరశక్తిని పెద్ద ఎత్తున అందిపుచ్చుకోవాలని చెప్పారు. దేశం మనకెంతో ఇచ్చిందని.. దానికి కృతజ్ఞతలు చెప్పే సమయం వచ్చిందన్నారు. 
 
ప్రజలు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. పొదుపు చర్యలను దశలవారీగా చేపడదామని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సూచించగా.. సీఎం సానుకూలంగా స్పందించారు. ప్రతి నిర్ణయానికీ ప్రజలను సన్నద్ధం చేసిన తర్వాత ప్రకటన చేద్దామన్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు.. కారు డిక్కీలో పిల్లలు... ప్రమాదకరమైన జర్నీ (వీడియో)