సంబంధిత వార్తలు
- విద్యార్థినిపై ప్రిన్సిపల్ లైంగిక దాడి - ప్రిన్సిపల్ ప్రైవేట్ పార్టును కొరికిన విద్యార్థిని (వీడియో)
- మెరుగైన చికిత్స చేయిస్తానని చెప్పి కదిరి ఆస్పత్రిలో భార్యను హత్య చేసిన భర్త
- భార్య కళ్లెదుటే ప్రియురాలితో కలిసి భర్త ఆత్మహత్యాయత్నం
- పిల్లల ఐసీయూ బెడ్స్ ఖాళీలేవన్న సిబ్బంది.. శివసేన కార్పొరేటర్ పిడుగుద్దులు (వీడియో)
- July 08, 2026: తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?
ఆడామగా తేడా లేకుండా జుట్లు పట్టుకుని తన్నుకున్న వైకాపా నేతలు (వీడియో)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా పార్టీ నేతలు సొంత పార్టీ నేతలపై కూడా దాడులకు తెగబడుతున్నారు. ఈ దాడులు చేసేటపుడు ఆడా, మగా అనే తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా వైకాపా కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను వైకాపా నేతలు నిర్వహించారు. ఈ వేడుకల్లో వైకాపా నేతలు, కార్యకర్తలు జట్లు పట్టుకుని కొట్టుకున్నారు. మహిళలు అని కూడా చూడకుండా దాడి మహిళా నేతలపై దాడి చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలను కొందరు వైకాపా నేతలు కాళ్లు తొక్కారు. దీన్ని ప్రశ్నించినందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో వైకాపా ఎస్సీ ఎస్టీ విభాగం అధ్యక్షురాలు పేరం ప్రసన్నపై మరో మహిళా నేత మేరి, ఆమె భర్త శ్రీను భౌతికంగా దాడి చేయడంతో పాటు ఆమెను మెట్లపై నుంచి కిందకు తోసేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ దాడి ఘటనపై వైకాప మహిళా సంఘాలు ఏవిధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే.
జుట్లు పట్టుకుని కొట్టుకున్న వైసీపీ కార్యకర్తలు.
— JSP Naresh (@JspBVMNaresh) July 8, 2026
మహిళలు అని కూడా చూడకుండా దాడి చేసిన వైసీపీ నాయకులు మరీ వైసీపీ మహిళా సంఘాలు ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి ????
ఒంగోలు వైసీపీ కార్యాలయంలో వైఎస్సార్ జయంతి వేడుకలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ కార్యక్రమంలో మహిళల కాళ్లు… pic.twitter.com/AoKrlx7VHq
