రెడ్ బుక్ పేరెత్తితే కొడాలి నాని వెన్నులో వణుకు : మంత్రి వాసంశెట్టి
వైకాపా నేత, మాజీ మంత్రి కొడాలి నానిని ఉద్దేశించి ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శనాస్త్రాలు సంధించారు. నారా లోకేశ్ చేతిలో ఉన్న రెడ్ బుక్ పేరు ఎత్తితే కొడాలి నాని వెన్నులో వణుకు పుడుతోందని ఆరోపించారు.
ఆయన శనివారం అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ, గతంలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని సంతోష పెట్టేందుకు కొడాలి నాని బూతు పదజాలాన్ని ఎంచుకుని టీడీపీ నేతలను నోటికొచ్చినట్టు దూషించారన్నారు. ఇలా పరుష పదజాలంతో తమ పార్టీ నేతలను తిట్టిన వైకాపా నేతల పేర్లను తమ పార్టీ నేత నారా లోకేశ్ రెడ్ బుక్‌లో రాసుకున్నారన్నారు. ఇపుడు ఆ బుక్ పేరు చెబితో కొడాలి నానితో పాటు వైకాపా నేతల వెన్నులో వణుకు పుడుతోందన్నారు.
వైకాపా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొడాలి నాని... ఆ రెడ్ బుక్‌ను మడిచి... అక్కడ పెట్టుకోవాలంటూ మీడియాతో అన్నారు. అలాగే, మాజీ మంత్రులు ఆర్కే రోజా, పేర్ని నాని, జోగి రమేష్ వంటివారు కూడా ఇష్టానుసారంగా మాట్లాడారు. ఇపుడు అదే రెడ్ బుక్ పేరు ఎత్తితే మాత్రం వణికిపోతుండటం గమనార్హం.